Search
Close this search box.

వినుకొండలో వైఎస్‌ జగన్‌ పర్యటన

హత్యకు గురైన రషీద్‌ కుటుంబానికి పరామర్శ

అన్ని విధాలుగా అండగా ఉంటానని హావిూ

వినుకొండలో రెండు రోజుల కిందట దారుణ హత్యకు గురైన రషీద్‌ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్‌ పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా రషీద్‌ తల్లిదండ్రులు హత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షల కారణంగా హత్యలు చేశారని చెబుతన్నారని.. కానీ రాజకీయ కక్షల కారణంగానే హత్య చేశారని రషీద్‌ తల్లి జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. హంతకుడు జిలానీ కాల్‌ రికార్డులు తీస్తే .. ఎవరెవరితో మాట్లాడారో స్పష్టత వస్తుందన్నారు. రషీద్‌ హత్య వెనుక కుట్ర ఉందని.. ప్రధాన నిందితుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో లేవన్నారు. నిందితుడు జిలానీకి టీడీపీతో సంబంధాలు ఉన్నాయని ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి పేరు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిందితుడు జిలానీ వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారన్నారు. తన కొడుకును చంపిన వాళ్లను రోడ్డుపైనే ఉరి తీయాలి అని రషీద్‌ తల్లిదండ్రులు జగన్‌ ను కోరారు. టీడీపీ నేతలతో జిలానీ ఉన్న ఫొటోలను జగన్‌కు రషీద్‌ కుటుంబ సభ్యులు చూపించారు. ‘హత్య వెనుక ఎవరున్నా వదలం. విూ కుటుంబానికి అండగా ఉంటాం‘ అని జగన్‌ వారికి ధైర్యం చెప్పారు. సుధాకరన్నకు ఫోన్‌ చేస్తే అన్నీ చూసుకుంటారని హావిూ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీలో దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చారని.. ఇచ్చిన ఏ హావిూని అమలు చేయడం లేదని రషీద్‌ కుటుంబసభ్యులతో జగన్‌ అన్నారు. ఉదయం పదొండు గంటల సమయంలో తాడేపల్లి నుంచి బయలుదేరిన వైసీపీ అధినేత సాయంత్రం ఐదు గంటల సమయంలో వినుకొండ చేరుకున్నారు. చాలా చోట్ల వైసీపీ నేతలు జన సవిూకరణ చేసి.. రోడ్డు బలప్రదర్శన చేశారు. అదే సమయంలో వర్షం కూడా పడుతూండటంతో.. వాహన శ్రేణి నెమ్మదిగా సాగింది. మాజీ సీఎం హోదాలో ఉన్నందున జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీని ప్రభుత్వం కల్పించింది. ఇందులో భాగంగా బుª`లలెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కేటాయించారు. అయితే జగన్‌ ఆ వాహనంలో ప్రయాణించలేదు. ప్రైవేటు వాహనంలో వెళ్లారు. ఆ వాహనం ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయిందని వైసీపీనేతలు ప్రచారం చేశారు. కానీ అది అబద్దమని వాహన శ్రేణిలోనే బుª`లలెట్‌ ప్రూఫ్‌ వాహనం ఉందని పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
ఉత్తమ బ్యాంక్ మేనేజర్ రాష్ట్ర స్థాయి అవార్డు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు
ఉమ్మడి కరీంనగర్‌లో భూ ప్రకంపనలు
ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి
Screenshot_20250430-141720
బిచ్కుంద లొ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన జూక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు