అన్ని రంగాల్లో వెనకబడి పోయిన రాష్ట్రం
సంపద సృష్టికి సిఎం చంద్రబాబు కృషి
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రయత్నాలు
ఢల్లీిలో బిజీగా ఉన్న మంత్రి సత్యకుమార్
న్యూఢల్లీి,జూలై17(ఆర్‌ఎన్‌ఎ): వైసీపీ అరాచక పాలన కారణంగా రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడిరదని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. తాము సంపద సృష్టిస్తున్నామని.. అందుకే అమరావతి చుట్టూ రహదారుల నిర్మాణం వేగంగా చేపట్టామని వివరించారు. సంపద సృష్టికి కొంత సమయం పడుతుందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాజకీయ వివక్ష లేకుండా ప్రభుత్వ ఫలాలు అందరికీ
అందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వైకాపా నేతలు అధికారం కోల్పోయి 2 నెలలు కూడా కాకముందే మైండ్ గేమ్ ఆడుతూ రాజకీయ విమర్శలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాతీర్పుపై ఆత్మవిమర్శ చేసుకోకుండా వ్యవహరిస్తున్నారు. జీతాలు ఇవ్వాలి కాబట్టే కొంత అప్పులు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఢల్లీిలో మంత్రి సత్యకుమార్ బిజీ బిజీగా ఉన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ను సత్యకుమార్ బుధవారం కలిశారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత గురించి చర్చించామని అన్నారు. సంస్థాగతంగా పార్టీ విస్తరించేందుకు ప్రయత్నాలు చేయాలని చూస్తున్నామని వివరించారు. జాతీయస్థాయిలో అధ్యక్ష మార్పులుంటాయని చెప్పారు. ఏపీలో మార్పులు ఉంటాయా లేదా అన్నది తాను చెప్పలేనని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరించి, ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించానని అన్నారు. అలాగే గత ప్రభుత్వం ఐదేళ్లుగా రాష్ట్రంలో ఆరోగ్య విభాగాన్ని భ్రష్టుపట్టించిన విధానాన్ని కూడా వివరించానని చెప్పారు. 11 టీచింగ్ మెడికల్ కాలేజీలు ఉంటే, 6 కాలేజీల్లో మాత్రమే కేటలాగ్స్ ఉన్నాయన్నారు. మిగతా 5 కాలేజీలకు కేటలాగ్స్ మంజూరు చేయాలని కోరానని అన్నారు. కేన్సర్‌కి సంబంధించి మరికొన్ని కేంద్రాలు మంజూరు చేయాలని కోరానని తెలిపారు. ఔంఊఓ నుంచి నిధులు మంజూరు చేసే ప్రొవిజన్ లేదన్నారు. అయితే రూ. 300 కోట్లు మంజూరు చేయాలని కోరానని అన్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను పాత జిల్లాల లెక్కన మంజూరు చేశారని తెలిపారు. కొత్తగా జిల్లాలు ఏర్పడ్డ నేపథ్యంలో ఆ ప్రకారం మంజూరు చేయాలి. గ్రావిూణ ఆరోగ్య మందిర్ల నిర్మాణానికి సహకారం అందించాలి. ఆరోగ్య మందిర్లలో సిబ్బందికి జీతాలు చెల్లించడం కోసం రూ. 1,000 కోట్లు అందించాలి. అరాచక పాలన కారణంగా ఏపీ అన్ని రకాలుగా వెనుకబడిరది. రాష్ట్రంలో గత 45 రోజులుగా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రికి వివరించా. ఉచిత ఇసుక, సామాజిక భద్రత స్కీమ్స్ తదితర పథకాల గురించి చెప్పాను. సీఎం చంద్రబాబు ఢల్లీి వచ్చిన ప్రతిసారీ రాష్టాన్రికి ఏదో ఒకటి సాధించుకుని వెళ్తున్నారు. అమరావతి రింగ్ రోడ్డు ప్రాజెక్టు సామాన్య విషయం కాదు. భారత్ పెట్రో రిఫైనరీ, విశాఖ మెట్రో రైల్ ఇలా చాలా విభజన హావిూలను సాధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అమరావతిని స్మశానం చేయడం కోసం పనిచేసింది. రింగ్ రోడ్ వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయేవి. విశాఖపట్నం మెట్రో విషయంలో డీపీఆర్ రివైజ్ చేసి పంపించమంటే ఇంతవరకు గత ప్రభుత్వం ఇవ్వలేదు. విశాఖను పాలనా రాజధాని అన్నారు తప్ప చిత్తశుద్ధి ప్రదర్శించలేదు.
స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రకారం సీజనల్ వ్యాధుల గురించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏప్రిల్ నెల నుంచే ఈ ఏర్పాట్లు చేయాలి. మేం అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏవిూ చేయలేదు. మేము అధికారంలోకి వచ్చాక ఉదాసీనత లేకుండా పనిచేస్తున్నాం. జగ్గయ్యపేటలో ఐదేళ్లుగా క్లోరినేషన్ జరగలేదు. ఫిల్టర్లు మార్చలేదు. ఓవర్‌హెడ్ ట్యాంకుకు నిచ్చెన లేకపోవడం వల్ల క్లోరినేషన్ జరగడం లేదు. నిర్వహణ లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది తలెత్తుతుందో ఇదే ఉదాహరణ. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ జింక్ ట్యాª`లబెట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సంక్షేమం అసాధ్యం. అయినా సరే సంక్షేమం, అభివృద్ధి ` రెండూ చేస్తున్నాం. నాలుగేళ్లుగా సుగాలి ప్రీతి కేసులో ఏవిూ చేయకుండా, ఇప్పుడొచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు అవసరమే. నిర్మాణాత్మకంగా అవి ఉండాలి. గతంలో విమర్శలు చేస్తే ఎలా కేసులు పెట్టారు? ఎలా వేధించారు? విూ
పనుల కారణంగా ప్రజలు ఇలాంటి తీర్పునిచ్చారు. సుగాలి ప్రీతి కేసుకు సమాధానం చెబుతాం. అలాగే గొడ్డలి పోటుకు కూడా సమాధానం చెబుతాం అని మంత్రి సత్యకుమార్ తెలిపారు. పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధులపై ముందు జాగ్రత్తల విషయంలో గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల మా ప్రభుత్వం ఒక కమిటీ వేయాల్సి వచ్చింది. విూరు దోచుకున్న భూములకు చట్టబద్ధత కల్పించుకోవడం కోసం ఒక చట్టాన్ని తెచ్చి, కేంద్ర ప్రభుత్వంసూచించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు పారిపోకుండా నిర్మాణాత్మక చర్చ జరిగేలా సహకరించాలి. ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా వ్యవహరించేలా ఐదేళ్లలో విధ్వంసం జరిగింది. అధ్యయనం చేయకుండా అడ్డగోలుగా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. వాటికి నిధులు ఇవ్వలేదు. చాలావాటికి కేంద్రం వివిధ స్కీముల ద్వారా, నాబార్డ్ ద్వారా నిధులు అందజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సింది ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఔఓఅ నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా పునాదులు వేసి వదిలేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ నిర్మాణం మాత్రమే పూర్తయింది. హాస్టల్ పూర్తికాలేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
‘రూ. 9 వేల కోట్లు ఉంటే తప్ప మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి కావు. వీటిని కట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. అన్ని వ్యవస్థల్లో చాలా రకాలుగా విధ్వంసం చేశారు. దార్శనికత కలిగిన నాయకత్వం రాష్ట్రంలో ఉంది. జరిగిన విధ్వంసాన్ని సరిదిద్ది గాడిలో పెట్టగలం అని నమ్ముతున్నాం. మెడికల్ ఇన్సూరెన్స్‌ను హైబ్రీడ్ మోడల్లో ప్రజలకు రూ. 25 లక్షల మేర లబ్ది పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ, మెడికల్ ఇన్సూరెన్సులను కలిపి పనిచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. శ్వేతపత్రాలు ప్రతి శాఖలోనూ ఇవ్వడం సాధ్యం కాదు. నేషనల్ హెల్త్ మిషన్ కింద అదనంగా రూ. 1,000 కోట్లు ఎన్వలప్ కింద ఇవ్వాలని కోరాం. మామూలుగా రూ. 2,300 కోట్లు, అదనంగా మరో రూ. 500 కోట్లు వస్తున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో ఉన్న లోటుపాట్ల కారణంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ క్లియరెన్సులు ఇవ్వలేదు. ప్రైవేట్ భాగస్వామ్యం లేదా పీపీపీ మోడల్.. ఇలా చాలా రకాల ఆప్షన్ల ద్వారా కొత్త మెడికల్ కాలేజీలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరికీ కేన్సర్ స్క్రీనింగ్ జరపడం కోసం మొదటి సంతకం చేశా. కేన్సర్‌ను ముందే గుర్తిస్తే ప్రభుత్వంపై ట్రీట్మెంట్ భారం కూడా తగ్గుతుంది. ఖాళీ ఖజానా ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లోనే అప్పు చేయాల్సి వస్తోంది‘ అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.