Search
Close this search box.

TV5 సీనియర్ కెమెరామెన్ ఆకస్మిక మృతి

*💐సీనియర్ కెమెరామెన్ చంద్రశేఖర్ ఆకస్మిక మరణం తీరనిలోటు🙏*

 

*-ప్రగాఢ సంతాపం తెలిపిన TV-5 చైర్మెన్‌ బి.ఆర్ నాయుడు మ*

 

*-యాజమాన్యం తరపున కెమెరామెన్ కుటుంబానికి 5లక్షల ఎక్సెగ్రేషియా*

 

సమాజహితమే ఊపిరిగా రాత్రింబవళ్ళు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న సమాఛార స్రవంతులు , శ్రేయస్కర భవిష్యత్ కు పునాదులు , ప్రజా గొంతుకతో

ప్రశ్నించే అక్షర జ్యోతులు జర్నిలిస్ట్ లు అని TV-5 చైర్మెన్‌ బిఆర్ నాయుడు అన్నారు.

 

విధి నిర్వాహణలో ఆకస్మిక మరణానికి గురైన అనంతపురం జిల్లా వీడియో జర్నలిస్ట్ TV5 కెమెరామెన్ చంద్రశేఖర్ కు ప్రగాఢ సంతాపం తెలిపారు.

 

కెమెరామెన్ చంద్రశేఖర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు.

 

TV5 యాజమాన్యం తరపున

రూ”5 లక్షలు తక్షణ సాయంగా ఎక్సెగ్రేషియా ప్రకటించారు.

 

జర్నిలిస్ట్ చంద్రశేఖర్ కుటుంబ క్షేమాన్ని ఆలోచించి, తక్షణ సాయంగా 5లక్షల ఎక్సెగ్రేషియా ప్రకటించిన TV5 అధినేత బిఆర్ నాయుడు గారి ఉధారతకు, కృతఙ్ఞతలు తెలియజేస్తూన్నాము.

తమ దగ్గర పని చేస్తున్న జర్నలిస్టుల బ్రతుకులకు భరోసా కల్పిస్తూ విలువలతో కూడిన ఇలాంటి యాజమాన్యం వద్ద పని చేయడం గర్వంగా ఉంది.జర్నలిస్ట్ ల యోగక్షేమాలకు మొదట ప్రాధాన్యత ఇస్తూ, స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన బిఆర్ నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని అన్ని మీడియా సంస్థలు, తమ సంస్థల పనిచేస్తున్న జర్నలిస్ట్ ల యోగక్షేమాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు.

 

చంద్రశేఖర్ కుటుంబానికి బాసటగా టీవీ5 యాజమాన్యం, 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన యాజమాన్యం.

 

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన అనంతపూర్ టీవీ5 స్టాఫ్ కెమెరామెన్ చంద్రశేఖర్ కుటుంబానికి అండగా నిలవాలని *TV5* యాజమాన్యం నిర్ణయించింది. సుదీర్ఘకాలం సంస్థకు సేవలు అందించిన చంద్రశేఖర్ కుటుంబానికి *5 లక్షల రూపాయల* ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. త్వరలోనే చంద్రశేఖర్ సతీమణికి ఈ సహాయాన్ని అందించనున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి