Search
Close this search box.

ఇదే సభలో కులగణన బిల్లు ఆమోదిస్తాం

అనురాగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలపై రాహల్‌ సవాల్‌

ఠాకూర్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందన

 ఇదే సభలో కులగణన బిల్లును ఆమోదించి చూపుతామని ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ మంగళవారం ప్రకటించారు. లోక్‌ సభలో బిజెపి ఎంపీ అనురాగ్‌ ఠాకుర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనను అవమానించారని మండిపడ్డారు. అనురాగ్‌ ఠాకుర్‌ ‘ఎవరికైతే తమ కులం కూడా తెలియదో వారు కుల గణన గురించి మాట్లాడుతున్నారని అన్నారు. దీనిపై రాహుల్‌ గాంధీ స్పందిస్తూ ఎవరైతే ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వారికి సంబంధించిన సమస్యలు లేవనెత్తుతారో వారిని కించపరుస్తున్నారని అన్నారు. కులం తెలియని వారు కూడా కుల గణన గురించి మాట్లాడుతున్నారు. ఈ సభలోనే మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ రిజర్వేషన్‌ను వ్యతిరేకించారని నేను స్పీకర్‌కు గుర్తు చేయాలనుకుంటున్నాను అని బిజెపి ఎంపి అనురాగ్‌ ఠాకూర్‌ సభలో అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని దేశానికి హావిూ ఇచ్చిన రాహుల్‌ గాంధీ తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. విూరు ఎంత కావాలనుకుంటే అంతగా నన్ను అవమానించవచ్చు, కానీ మేము పార్లమెంటులో కుల గణనను పాస్‌ చేస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు. తర్వాత ఠాకూర్‌ తన వ్యాఖ్యల్లో ఎవరి పేరును ప్రస్తావించలేదని చెప్పారు. కులం గురించి తెలియని వ్యక్తి కుల గణన గురించి మాట్లాడుతున్నారని నేను అన్నాను, కానీ నేను ఎవరి పేరు ప్రస్తావించలేదని అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. కానీ తర్వాత రాహుల్‌ గాంధీ , ఠాకూర్‌ తనను దుర్భాషలాడారని, అవమానించారని 

ఆరోపించారు. అయితే ఆయన నుంచి తాను క్షమాపణలు కోరుకోవడం లేదన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన హావిూల్లో కుల గణన ఒకటి. ఎన్నికలకు ముందు రాహుల్‌ గాంధీ దీనిని భారతదేశం యొక్క ఎక్స్‌`రే అని పిలిచారు. దేశంలో ఎంత మంది వెనుకబడినవారు, దళితులు, గిరిజనులు ఉన్నారో ఎవరికీ తెలియదా? జనాభాలో అత్యధికంగా ఉన్న వారికి వారి సంఖ్య తెలియదు. బిజెపి ప్రభుత్వానికి కులాల డేటా అక్కర్లేదు. కానీ వివిధ కుల సమూహాల జనాభాను నిర్దారించడానికి మేము భారతదేశం యొక్క ఎక్స్‌`రేను పొందుతాము. కుల గణన పూర్తయితే దేశం మారిపోతుంది’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. కాగా కుల ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని బిజెపి ఆరోపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250405-WA0368
ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు
గావిచర్ల గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఒకరు మృతి
గావిచర్ల గుండ బ్రహ్మయ్య జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 
పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళా సంఘాల సభ్యులు.

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి