రష్యాలో అగంతకులు రెచ్చి పోయారు. రెండు చర్చిలు, ఓ యూదుల ప్రార్థనామంది రాలు, పోలీసుల చెక్ పోస్టు పై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 15మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో పోలీసులతోపాటు పలువురు పౌరులు ఉన్నట్లు డాగేస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు. కాగా భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో 6గురు అగంతకులు హతమ య్యారు. మఖచ్ కల, డెర్బెంట్ నగరాల్లోని చర్చిలు, ప్రార్థనామంది రాలను లక్ష్యం చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ను చేపట్టాయి. ప్రస్తుతానికి ఆపరేషన్ ముగిసినట్లు రష్యా జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటించింది. ఇది ఉగ్రవాదుల చర్యనా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ ఘటన కారణంగా దగేస్తాన్‌లో సోమ, మంగళ, బుధవారాలను సంతాప దినాలుగా ప్రకటించారు. రష్యాలోని దక్షిణ రాష్ట్ర మైన డాగేస్తాన్‌లోని రెండు నగరాల్లోని రెండు ఆర్థోడా క్స్ చర్చిలు, ఒక ప్రార్థనా మందిరలతో పాటు… ట్రాఫిక్ పోలీసు చెక్ పోస్ట్‌ల పై గుర్తుతెలియని దుండగు లు దాడి చేశారని, ఒక పాస్టర్ కనీసం ఆరుగురు పోలీసు అధికారులను చంపినట్లు రష్యా అధికారు లు తెలిపారు. అదే సమయంలో సాయుధ తీవ్రవాద చరిత్ర కలిగిన ముస్లిం మెజారిటీ ప్రాంతం లో జరిగిన దాడులను తీవ్రవాద చర్యలుగా రష్యా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కమిటీ అభివర్ణించింది…