Search
Close this search box.

ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాలు

అనూహ్యంగా ఎమ్మెల్యే బండ్ల యూ టర్న్‌

తిరిగి బిఆర్‌ఎస్‌లోకి వెళ్లిన గద్వాల ఎమ్మెల్యే

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏకంగా 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో.. బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం దిశగా హస్తం పార్టీ అడుగులు వేస్తోందనే చర్చలు జోరుగా సాగాయి. బీఆర్‌ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందని అనుకుంటున్న తరుణంలో గద్వాల ఎమ్మెల్యే యూ టర్న్‌ తీసుకున్నారు. తిరిగా ఆయన సొంతగూడు బిఆర్‌ఎస్‌లో చేరారు. బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినట్లే చేరి తిరిగి బిఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తుంటే కాంగ్రెస్‌లోకి వచ్చేవారికి 

పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని, బిఆర్‌ఎస్‌లో ఉంటే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందన్న భావన ఉంది. కాంగ్రెస్‌ నేతల కామెంట్స్‌ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేల జాయినింగ్స్‌తో బీఆర్‌ఎస్‌ఎల్‌ఎపీ.. కాంగ్రెస్‌లో విలీనం ఖాయమని చెప్తూనే.. మరోవైపు.. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్‌ చేయడం ఆసక్తిగా మారుతోంది. బీఆర్‌ఎస్‌ విలీనంపై కోమటిరెడ్డి కామెంట్స్‌ వెనుక ఉన్న అర్థం ఏంటన్నది తెలియాలి. నిజానికి అంత ఆకాంగ్రెస్‌లో చేరుతారని అనుకున్నారు. కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ విమర్శలను బీఆర్‌ఎస్‌ ఎలా తిప్పికొట్టబోతోందన్నదీ ఆసక్తికరంగా మారింది. అయితే.. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీఆర్‌ఎస్‌ విలీనంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌?రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బ్జడెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగినా మోదీ సర్కార్‌ను కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ విలీనానికి చర్చలు జరుగుతున్నాయనేదానికి ఇదే నిదర్శనమని చెప్పారు. బీజేపీలో విలీనానికి అడుగులు పడుతుండడంతోనే కేంద్రాన్ని కేసీఆర్‌ ఒక్క మాట అనడంలేదని ఆరోపించారు. వాస్తవానికి.. ఇప్పటికే 10మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరికొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారని హస్తం పార్టీ నేతలు లీకులు ఇచ్చారు. దాంతో.. బీఆర్‌ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం ఖాయమనే సంకేతాలు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనంపైనే పెద్దయెత్తున చర్చలు సాగుతుండడగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ విలీనంపైనా తమకు పక్కా సమాచారం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ ఆసక్తిగా మారుతున్నాయి. అంటే.. ఈ లెక్కన.. బీఆర్‌ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం అయితే.. బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అటు.. కాంగ్రెస్‌ నేతల కామెంట్స్‌ను బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాంగ్రెస్‌ మైండ్‌గేమ్‌ విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. మొత్తంగా.. బీజేపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ విలీనం ఖాయమన్న కోమటిరెడ్డి కామెంట్స్‌ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే అనూహ్యంగా బండ్ల వోనక్కి వెళ్లడంతో బిఆర్‌ఎస్‌ ఎత్తుకు పె ఎత్తులు వేస్తోందని అర్థం అవుతోంది. వెళ్లిన వారు తిరిగి వస్తారన్న ధీమాలో ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి