పవిత్రతను కాపాడేలా చర్యలు
సమర్థులైన అధికారుల నియామకం
త్వరలోనే పాలకమండలి కోసం కసరత్తు
తిరుమల పవిత్రతను కాపాడుతూ..భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా టీటీడీ ప్రక్షాళన దిశగాచంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల ఆలయ ప్రతిష్ఠ మంటగలిపారని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధికారులను మార్చివేస్తోంది. ఇప్పటికే ఈవోగా శ్యామలారావును నియమించగా..ఇప్పుడు జేఈవోగా వెంకయ్య చౌదరిని నియమించింది.
ఒక టిటిడి ఛైర్మన్‌తో పాటు, పాలకమండలిని నియమించాల్సి ఉంది. పూర్తి ఆధ్యాత్మికతతో పాటు, అభివృద్దికి సహకరించే వారిక ఇస్థానం కల్పించే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానములను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా సీఎం చంద్రబాబు నడుం బిగించారు. వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలకు కేంద్రంగా టిటీడీని మార్చేశారని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. అందుకే ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేని సీనియర్, సిన్సియర్ అధికారులకు కీలక పదవుల్లో పోస్టింగ్ ఇస్తోంది. తిరుమలకు గత వైభవం తీసుకుని రావడంతోపాటు..కేవలం ఆధ్యాత్మిక వాతావరణం తప్ప ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా తిరుమల కొండలకు పూర్వస్థితిని తీసుకురావాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఈవో ధర్మారెడ్డిని తొలగించింది. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలారావును నియమించింది. ఆయన్ను కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్‌పై రాష్టాన్రికి రప్పించి కీలకమైన పదవిని కట్టబెట్టింది. గతంలోనూ ఆయన తిరుమల ఈవోగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు మరో కీలకమైన జేఈవో పోస్టులో సైతం చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని నియమించారు. ఈయన కూడా కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై తీసుకొచ్చారు. చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి మంచి సమర్థవంతమైన అధికారిగా పేరుంది. ప్రస్తుతం కేంద్ర,ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని కష్టమ్స్ కమిషనరేట్ పరిధిలోని విజయవాడశాఖ కమిషనర్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఆయన్ను డిప్యూటేషన్ పై ఏపీకి పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. డిప్యూటేషన్‌పై మూడేళ్లపాటు పంపేందుకు అంగీకరించింది. దీంతో ఆయన్న తితిదే జేఈవోగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గతంలో ఆయనకు ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్‌గా ఎండీగా పనిచేసిన అనుభం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే తిరుమల ప్రక్షాళన దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈవోగా శ్యామలారావు బాధ్యతలు చేపట్టిన వెంటనే దళారుల ఆగడాల ఆటకట్టించారు. విజిలెన్స్ విభాగాన్ని బలోపేతం చేశారు. ఎక్కడికక్కడ దాడులు చేసి దళారులు పారిపోయేలా చేశారు. భక్తులను దోచుకుంటున్న ఉద్యోగులను హెచ్చరించారు. వ్యాపారులను అదుపు చేయడంతోపాటు…సామాన్య భక్తులు స్వామివారిని దర్శించు కునేలా మార్పులు, చేర్పులు చేపట్టారు. కాలినడక భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడంతో పాటు…వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు అన్నీ తెరిపించి భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి ఉంచితే వారికి ప్రసాదం, పాలు, టీ వంటి అదనపు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని….ఉచిత దర్శనం భక్తులను గంటల తరబడి కిలోవిూటర్ల పొడవునా క్యూలైన్లలోనే వేచి ఉంచేలా చేశారు. ఇప్పుడు సర్వదర్శనం భక్తులందరినీ క్యూకాంప్లెక్స్‌లోకి అనుమతిస్తున్నారు. గతంలో మాదిరిగా అక్కడ స్వామివారి ప్రసాదం, చిన్నపిల్లలకు పాలు అందిస్తున్నారు. టిక్కెట్లు జారీ, గదుల
కేటాయింపులోనూ పెనుమార్పులు తీసుకురానున్నారు. వేలకోట్ల రూపాయల ఆస్తులు, కోట్లాది మంది హిందూవుల మనోభావాలతో తిరుమల ఆలయం ముడిపడి ఉండటంతో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే తిరుమల ఈవోగా ఐఏఎస్‌స్థాయి అధికారిని నియమించడం జరిగింది. అయితే వైసీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మారెడ్డి కోసం ఆ స్థాయిని మళ్లీ తగ్గించింది. తిరుమలకు ఈవో సహా ఇద్దరు జేఈలు ఉండగా….వారిని తిరుపతికే పరిమితం చేసింది. చంద్రబాబు తిరిగి అధికారం చేపట్టడంతో ఈవోగా మళ్లీ ఐఏఎస్ అధికారినే నియమించారు. జేఈవోగానూ ఐఆర్‌ఎస్ అధికారిని తీసుకువచ్చారు. వీరిరువురూ తిరుమలలోనే పనిచేయనున్నారు. ఇకపోతే మళ్లీ పూర్వ వైభవం రావాలని భక్తులు కూడా కోరుకుంటున్నారు.