రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ లంక పర్యటనకు దూరంగా ఉండడంతో టీమిండియా కెప్టెన్ అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. భారత భారత జట్టు హెడ్ కోచ్ గా బీసీసీఐ గౌతమ్ గంభీర్ ను మంగళవారం (జూలై 9) అధికారికంగా ప్రకటించింది. భారత జట్టు సెలక్షన్ కమిటీతో గంభీర్ తొలి సమావేశం ఈ వారం చివర్లో జరగనుంది. రెండు ఫార్మాట్లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లను ఎంచుకోవాలని గంభీర్ ఆసక్తిగా ఉన్నాడని అర్థమవుతోంది. వన్డే ఫార్మాట్ కు గతంలో భారత్ ను నడిపించిన కేఎల్ రాహుల్ శ్రీలంక టూర్ కు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్ కు కెప్టెన్ గా పేరు దాదాపుగా ఖరారైనట్టు నివేదికలు చెబుతున్నాయి. రాహుల్ కెప్టెన్సీలో భారత్ 2023 చివర్లో దక్షిణాఫ్రికాపై 2-1 తో సిరీస్ గెలిచింది. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ కు డిప్యూటీగా హార్దిక్ పాండ్య ఉన్నాడు. దీంతో పాండ్య పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ రాహుల్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో గాయపడిన పాండ్య ఇప్పటివరకు వన్డే మ్యాచ్ ఆడలేదు. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీమిండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో యువ క్రికెటర్లు ఈ సిరీస్ లో సత్తా చాటుతున్నారు. ఈ సిరీస్ తర్వాత మన క్రికెట్ జట్టు శ్రీలంకకు బయలుదేరతారు. ఆగస్టులో సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ , స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేస్ గన్ జస్‌ప్రీత్ బుమ్రా దూరంగా ఉండనున్నారు. ఐపీఎల్ నుంచి నిరంతరాయం క్రికెట్ ఆడుతున్న స్టార్ ప్లేయర్లు లాంగ్ బ్రేక్ కావాలని బీసీసీఐని కోరినట్టు తెలుస్తోంది.