Search
Close this search box.

రూ.2.5 కోట్లు రిజెక్ట్‌ చేసిన రాహుల్‌ ద్రావిడ్‌

రాహుల్‌ ద్రావిడ్‌ కోచింగ్‌లో ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టైటిల్‌ గెలిచింది టీమిండియా. 11 ఏళ్ల తర్వాత టీమిండియా గెలిచిన ఐసీసీ టైటిల్‌ ఇది… వెస్టిండీస్‌లో జరిగిన ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీ ఫైనల్‌లో సౌతాఫ్రికాని 7 పరుగుల తేడాతో ఓడిరచి, ఉత్కంఠ విజయం అందుకుంది భారత జట్టు. ఈ విజయంలో భాగమైన టీమిండియా ప్లేయర్లకు, కోచింగ్‌ స్టాఫ్‌కి రూ.125 కోట్ల రివార్డు ప్రకటించింది బీసీసీఐ… ఈ క్యాష్‌ ప్రైజ్‌ని 15 మంది ప్లేయర్లతో పాటు కోచింగ్‌ స్టాఫ్‌కి సమానంగా పంచుతామని ప్రకటించింది. ఇందులో భాగంగా ప్లేయర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు, కోచింగ్‌ స్టాఫ్‌కి రూ.2.5 కోట్లు ఇచ్చారట. అయితే టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌కి రూ.5 కోట్లు ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధపడినా, సున్నితంగా తిరస్కరించి, రూ.2.5 కోట్లు తీసుకున్నాడట రాహుల్‌ ద్రావిడ్‌..

‘బీసీసీఐ ఇచ్చిన ప్రైజ్‌ మనీలో కోచింగ్‌ స్టాఫ్‌లో ఒక్కొక్కరికీ రూ.2.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే హెడ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌కి రూ.5 కోట్లు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అదనంగా ఇచ్చే రూ.2.5 కోట్లు తీసుకునేందుకు రాహుల్‌ ద్రావిడ్‌ ఇష్టపడలేదు. మిగిలిన కోచింగ్‌ సభ్యులు ప్రభాస్‌ మాంబ్రే, విక్రమ్‌ రాథోడ్‌, టి దిలీప్‌లకు ఎంత అయితే ఇచ్చారో, తనకు అంతే ఇవ్వాలని కోరారు.. ఆయన నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం..’ అంటూ ఓ బీసీసీఐ అధికారి, మీడియాకి తెలిపాడు..

ప్లేయర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు, కోచింగ్‌ స్టాఫ్‌కి తలా రూ.2.5 కోట్లు ఇవ్వగా మిగిలిన దాంట్లో ఐదుగురు సెలక్టర్లకు తలా రూ.1 కోటి ఇచ్చింది బీసీసీఐ.. అయినా కూడా ఇంకా రూ.35 కోట్లు మిగులుతుంది. మరి ఈ మొత్తాన్ని ఏం చేశారనేది తెలియరాలేదు. రాహుల్‌ ద్రావిడ్‌ ఇంతకుముందు కూడా ఇదే విధంగా వ్యవహరించారు. అండర్‌19 వరల్డ్‌ కప్‌ 2018 గెలిచిన టీమ్‌కి కోచ్‌గా ఉన్న సమయంలో బీసీసీఐ ఇచ్చిన రివార్డులో రూ.30 లక్షలను వెనక్కి ఇచ్చాడు రాహుల్‌ ద్రావిడ్‌. తాను కూడా మిగిలిన సపోర్టింగ్‌ స్టాఫ్‌తో పాటే రూ.20 లక్షల రివార్డు మాత్రమే తీసుకుంటానని చెప్పాడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి