కాలేజీల్లో డ్రగ్స్ నియంత్రణకు కఠన చర్యలు
3,220 లెక్చరర్ పోస్టుల భర్తీకి కసరత్తు
అధికారులతో సవిూక్షలో మంత్రి లోకేశ్ ఆదేశాలు
రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతోన్న విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఉన్నత విద్యపై అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌కు విధివిధానాలు తయారు చేయాలని సూచించారు. గత ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. కళాశాలల్లో డ్రగ్స్ అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్‌పై చైతన్యానికి స్వచ్ఛంద సంస్థల సాయం కోరాలని అధికారులకు మంత్రి లోకేశ్ సూచించారు. ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ల నియామకాన్ని పరిశీలించాలన్నారు. 3,220 లెక్చరర్ పోస్టుల అంశం ప్రస్తావనకు రాగా.. న్యాయపరమైన చిక్కులు తొలగించి భర్తీకి కసరత్తు చేపట్టాలని చెప్పారు. పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ పక్రియ ఉండాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రూ.3,480 కోట్లు బకాయిలు ఇవ్వలేదని, దీంతో విద్యార్థుల ధ్రువపత్రాలు ఆయా సంస్థల్లోనే ఉండిపోయాయని చెప్పారు. పాత ఫీజు రీయింబర్స్ మెంట్‌పై విధివిధానాలు రూపొందించాలని విద్యాశాఖామంత్రి నారాలోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. విద్యాదీవెన, వసతి దీవెనకు సంబంధించి గత ప్రభుత్వం 3,480 కోట్లు బకాయిలు విధించిన సంగతి తెలిసిందే. బకాయి విడుదల చేయకపోవడంతో ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు ఉన్నాయి. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 3220 లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. న్యాయపర చిక్కులను తొలగించి త్వరగా పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రమేయం లేకుండా నియామకం జరగాలి. ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా పోస్టుల భర్తీ పక్రియ చేపట్టాలి. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్ ఇయర్, ఎగ్జామినేషన్ షెడ్యూల్, క్యాలండర్ రూపొందించాలి. నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహణ, ఫలితాల ప్రకటన చేపట్టేందుకు చర్యలు చేపట్టాలి అని’ అధికారులకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
’గత ఐదేళ్ల నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ తగ్గాయి. అడ్మిషన్స్ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. అడ్మిషన్లను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ఉన్నత విద్యా సంస్థల వివరాలు, మౌలిక సదుపాయాలు, అడ్మిషన్లు, కోర్టు కేసుల వివరాలను డ్యాష్ బోర్డులో పొందుపర్చాలి. ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల పక్రియ, ఫీజులు ఏ మేరకు ఉండాలి, రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల పనితీరు, అప్రెంటీస్ షిప్ ఎంబేడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ కోసం కాలేజీల ఎంపిక గురించి చర్చ జరిగింది అని’ మంత్రి నారా లోకేశ్ తేల్చి చెప్పారు. ఇదే కాక ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు అంశాలపై మంత్రి నారా లోకేశ్ సవిూక్షించారు