వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు అయింది.
గతంలో ఏపీ సీఎం చంద్రబాబు మానసిక పరిస్థితిపై సీదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేయడంతో పాటు ఓ వైద్యుడిగా ఆ విషయాన్ని తాను ధ్రువీకరిస్తున్నానన్నారు.
చంద్రబాబును ఆస్పత్రికి పంపి మానసిక పరిస్థితి బాగైన తర్వాతే అసెంబ్లీ అనుమతించాలని చెప్పారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు.