- నోటీస్ బోర్డులో కనపడని ఫీజు వివరాలు
- ప్రైవేట్ స్కూల్స్ లో కనబడని నియమ నిబంధనలు
- ప్రైవేటు పాఠశాలల తీరు నియంత్రించే వాళ్ళు ఎవరు..?ఎక్కడ…?
- పెన్ -పెన్సిల్ తప్ప అన్ని స్కూల్లోనే తీసుకోవాలా…?
జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం పుస్తకాలు,ఫీజులు,యూనిఫాంల పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తోంది.వేలాది రూపాయలు అడ్డగోలుగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.విద్యార్ధుల తల్లితండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలనే మోజులో నానా అవస్ధలు పడి వేలాది రూపాయలు చెల్లిస్తున్నారు.విద్యార్ధుల తల్లితండ్రుల బలహీనలతను ఆసరాగా తీసుకొని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు.
పాఠశాలలకు ఆట స్ధలం కాని కనీస మౌళిక వసతులు గాని లేవు.విద్యాశాఖ అధికారులు ముడుపులు తీసుకొని ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తుండటంతో ఏళ్ల తరబడి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అలాగే నడుస్తున్నాయి.ఇదంతా ఒక ఎత్తుకాగా పుస్తకాలు,యూనిఫాం పేరుతో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విదంగా దోపిడీ చేస్తున్నారు.ఒక్కో విద్యార్థి నుంచి తరగతులను బట్టి రూ.4వేల నుంచి రూ.8వేలు వరకు పుస్తకాల కోసం,యూనిఫాంకు రూ.4 నుంచి రూ.6 వేలు వసూళ్లు చేస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలలు అడ్డగోలుగా వేలాది రూపాయలు వసూళ్లు చేయటం పట్ల విద్యార్థుల తల్లితండ్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు పాఠశాల నియంత్రించే వాళ్ళు ఎవరు..?ఎక్కడ…?
ఫీజు నోటీసు బోర్డులో నమోదు చేయాలి..
ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రణను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.ఫీజులు ఏ క్లాస్ కు ఎంత తీసుకుంటారు అన్నది నోటీసు బోర్డులో నమోదు చేయాలి.కానీ విద్యార్థి సంఘాలు పదే పదే చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.ఫీజులు వసూలుతోపాటు పుస్తకాల పేరుతో మరి కొంత లాగుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేక ప్రైవేటు మామూళ్ల మత్తులోనే ఉంటారా వేచి చూడాలి.
ప్రైవేట్ స్కూల్స్ లో కనపడని నిబంధనలు..
ప్రైవేటు పాఠశాలలు కొన్ని నిబంధనల ప్రకారం నడవడం లేదు.పాఠశాలలకు మైదానాలు ఉండవు,రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడో మైదానం చూపిస్తారు.అది ఎక్కడుందో విద్యార్థులకు ఎప్పటికీ తెలిసే పరిస్థితి ఉండదు.రోడ్డు పక్కనే విద్యా సంస్థలు నడుపుతూ విద్యార్థులను శబ్ద కాలుష్యానికి గురి చేస్తున్నారు.చాలా స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ కూడా ఉండడం లేదు.ఉన్నా నామమాత్రమేనని పాఠశాలలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పిల్లల తల్లిదండ్రులని అడిగితే మా పిల్లలు స్కూల్లో చదువుతారు.కాబట్టి కానీ ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేమని,మా పిల్లలు చదువులో స్కూల్లో ఇబ్బంది పడతారని భయపడి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.