వెయ్యికిపైగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులు ధ్వంసం
ప్రత్యర్థులను వేధించేందుకే అధికార యంత్రాంగం
ఎంపిలు, ఎమ్మెల్యేలకు కూడా రక్షణ కరవు
50 మందికిపైగా సివిల్స్ క్యాడర్ ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వలేదు
ప్రధాని మోడీకి వైఎస్ జగన్ సంచలన లేఖ
జగన్ లేఖపై రాజకీయ దుమారం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారినప్పటి నుంచి హత్యలు, దాడులు, అకృత్యాలు పెరిగిపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైసీపీ అధ్యక్షుడు లేఖ రాశారు. ఇప్పుడీ లేఖపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పాలన కోసం వినియోగించాల్సిన అధికార యంత్రాగాన్ని ప్రత్యర్థులను వేధించడానికి వాడుతున్నారని అందులో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయ వేధింపుల కోసం వాడుతున్నారని ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో నడి రోడ్డుపై ఓ యువకుడు హత్య ఉదంతాన్ని వివరించారు. ప్రజలతోపాటు అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు కూడా వేధింపులు తప్పడం లేదని ఇప్పటి వరకు దాదాపు 50 మందికిపైగా సివిల్స్ క్యాడర్ ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వలేదని తెలిపారు. ప్రధాని మోదీకి గురువారం రాత్రి లేఖ రాసిన జగన్ అందులో ఏం ఫిర్యాదు చేశారంటే….’ ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 31 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపైగా వ్యక్తులపై హత్యాయత్నాలు జరిగాయి. ప్రభుత్వ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యాయత్నం చేశారు. వెయ్యికిపైగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారు. ముఖ్యంగా ఊళ్లలో టీడీపీ అరాచకాలు భరించలేక పాతికవేల కుటుంబాలు ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి. రోజూ జరిగే దౌర్జన్యాలు, దోపిడీలు, దాడులు సరేసరి’ అని లేఖలో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని టార్గెట్ చేసుకొని మాత్రమే పాలన సాగుతోంది. ప్రజలకు మేలు జరిగే పాలన అందివ్వడం లేదని ఆరోపించారు జగన్. రాజకీయాల్లో వైసీపీ అనే పార్టీ ఉండకూడదనే లక్ష్యంతోనే దాడులు దుర్మార్గాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. ప్రభుత్వ పెద్దల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంతా ఏకమైన ఇదే లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు. అధికారంలోకి రాక ముందు నుంచే రెడ్‌బుక్ పేరుతో అధికారులను, ప్రత్యర్థులను బెదిరించారని ఇప్పుడు దాన్నేఅమలు చేస్తున్నారని ఆరోపించారు జగన్. చాలా ప్రాంతాల్లో రెడ్‌బుక్ హోర్డింగ్స్ పెట్టి మరీ దాడులు చేస్తున్నారని విమర్శించారు. దాడులు చేయాలని శ్రేణులకు సంకేతాలు ఇవ్వడం, అడ్డుకోవద్దని అధికారులకు సూచనలు రెండూ ఒకే సారి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఆంధప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణలపై కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దిగజారుతున్నాయని ఇక్కడ వాస్తవ స్థితిగతులు వివరించేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ప్రధానమంత్రిని జగన్ కోరారు. ఏపీలో రాజ్యాగబద్ద సంస్థలు సక్రమంగా పని చేయడం లేదని ప్రజలకు రక్షమ లేకుండా పోయిందని భయానక వాతావరణం ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి నేటి వరకు వైసీపీ కార్యకర్తలతోపా ఓటు వేయని వారీపై, ఆస్తులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని
తెలిపారు. వైసీపీ తరపున పోటీ చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయిందని వారిపై కూడా దాడులు జరుగుతున్నాయని వివరించారు. పుంగనూరులో మిథున్ రెడ్డి, రెడ్డప్పరెడ్డి నివాసం వద్ద జరిగిన ఘటనలు ప్రధానమంత్రికి వివరించారు జగన్. ఇష్టానుసారంగా రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులను అడ్డుకోవాల్సిన యంత్రాంగం నిశ్చేష్టులై ఉండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎంపీలకే రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రజలపై దాడులు చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యకృత్యమైపోతున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్మాదులు రెచ్చిపోయి ప్రత్యర్థులపై పగ సాధిస్తున్నారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఏపీని విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఉత్తమంగా తీర్చిదిద్దామని… శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కాపాడామన్నారు జగన్. ఇప్పుడు హత్యలు, మానభంగాలు, కక్షపూరిత దాడులు తప్ప ప్రజలకు జరుగుతున్న మేలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.