ఆషాఢంలో గ్రామదేవతలను శాకాంబరీగా దర్శించి అనాధలకు అన్నవస్త్రాలివ్వాలి
స్వయంభు భోగిగణపతి పీఠం
కాకినాడ, జూలై 13 : అగస్త్యుని తలంపుతో తలుపులమ్మగా లోవ కొండల్లో నిలిచిన అమ్మవారి శక్తిపాతం ఆషాఢ మాసంలో విధిగా దర్శించాల్సిన అరాధ్యమని స్వయంభు భోగి గణపతి పీఠం పేర్కొంది. కాకినాడ నుండి వచ్చిన పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు వరలక్ష్మీ దంపతులు తలుపులమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనాధలకు అన్నవస్త్రాలందించారు. ఆలయ అధికారులు ప్రత్యేకదర్శనం చేయించి పూజారులతో ఆశీర్వచనం అందించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామ దేవతలను ఆషాఢంలో శాఖాంబరిగా దర్శించి పెద్దల పేరిట అనాధలకు అన్నవస్త్రాలందించడం ప్రారబ్ద కర్మల పరిహారానికి దోహదమయ్యే పరమ పుణ్య ప్రదమన్నారు.