ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులకు బ్రేక్
ఆపరేటింగ్ సిస్టమ్ దెబ్బతినడంతో పలు కంపెనీల్లో సమస్యలు
మైక్రోసాప్ట్.. ఆపరేటింగ్ సర్వర్లు బ్రేక్ డౌన్ కావటంతో.. ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులకు బ్రేక్ పడిరది. అమెరికా, ఆస్టేల్రియాల్లో దేశాల్లో ఎక్కడి విమానాలు అక్కడే ఆగిపోగా.. ఇండియాలో మాత్రం కొన్ని ఎయిర్ పోర్టుల్లో టికెట్ల బుకింగ్ కాకపోవటం వంటి సమస్యలు తలెత్తాయి. కంప్యూటర్లలో మైక్రోసాప్ట్ సాప్ట్ వేర్ ద్వారా ఆపరేటింగ్ చేసే అన్ని కంపెనీల్లో ఇదే సమస్య తలెత్తింది. మైక్రోసాప్ట్ సేవలకు అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాప్ట్ క్రౌడ్ స్టైక్ర్ సమస్య ఏర్పడిరది. దీంతో మైక్రోసాప్ట్ కు సంబంధించిన పలు సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా పలు సాప్ట్ వేర్ సంస్థలతోపాటు బ్యాంకులు, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇండియాలో కూడా సమస్య ఏర్పడిరది. ఇండియా కు చెందిన పలు ఎయిర్ లైన్స్ ఇండిగో, ఆకాశ, స్పైస్ జెట్ విమానాలు ఉదయం 10.45 గంటల నుంచి నిలిచిపోయాయి. మైక్రోసాప్ట్ విండోస్ ఆధారంగా పనిచేసే ల్యాప్ టాప్ లు , మైక్రోసాప్ట్ 360 ఆధారంగా పనిచేసే సర్వీసులపై ఎక్కువగా ప్రభావం చూపింది. అంతేకాదు ఈ సర్వీసులను పొందుతున్న బ్యాంకులు, ్గªనాన్షియల్ కంపెనీ?ల, విూడియా సంస్థల్లో పనులు నిలిచిపోయాయి. మైక్రో సాప్ట్ సర్వర్లు పనిచేయకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తి ప్రపంచవ్యాప్తంగా విండోస్ ల్యాప్ టాప్ లు పనిచేయడం లేదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. దీనిపై సోషల్ విూడియాలో ఫిర్యాదు కూడా చేస్తున్నారే?. తమ ల్యాప్ టాప్ సైబర్ దాడులకు సైతం గురయ్యాయని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. క్లౌడ్`ఆధారిత సర్వీసులలోయూజర్లు సమస్యలను ఎదుర్కొంటు న్నారు. అవుట్టేజ్ డిటెక్షన్ ప్లాట్ఫారమ్ డౌన్ డిటెక్టర్ కు ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వీసుల అంతరాయం కలిగింది. 74 శాతం మందియూజర్లు మైక్రోసాప్ట్ స్టోర్లోకి లాగిన్ అవ్వడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అయితే 36శాతం మంది యూజర్లు యాప్ లో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు మైక్రోసాప్ట్ విండోస్ ఓఎస్‌తో పనిచేసే ల్యాప్ టాప్ లు ప్రపంచవ్యాప్తంగా షట్ డౌన్ అవుతున్నాయి. యూజర్లు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్లోపాన్ని ఎదుర్కొంటున్నారు.
శుక్రవారం ఉదయం 10.30 గంటల తర్వాత చాలా మంది యూజర్లు ల్యాప్ టాప్‌లు రీస్టార్ట్ అవడం
ప్రారంభించాయి.మొదట్లో మామూలు అప్డేట్ వల్ల ఇలా జరుగుతోందని అనుకున్నారంతా.. అయితే దాదాపు అన్ని విండోస్ ల్యాప్ టాప్ లలో ఈ పరిస్థితి ఒకదని తర్వాత ఒకటి కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. ల్యాప్ టాప్ లు రీస్టార్ట్ అవుతున్నాయి.. మళ్లీమళ్లీ అప్డేట్ అవడంతోపాటు బ్లూ స్క్రీన్ కనిపించింది.