- ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి రాకతో వరుణుడు సైతం ఘన స్వాగతం…..!
- పెద్దకడబూరు మండలంలో వైసీపీ కార్యకర్తల సమావేశం
పెద్దకడుబూరు, జూలై 13 : ఎన్నికల్లో ఓటమి గెలుపు సహజమే వైసిపి కార్యకర్తలు అధైర్యపడోద్దని టిడిపి విష ప్రచారాలే ఓటమికి కారణమని మాజీ ముఖ్యమంత్రి జగనన్న ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాడని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం నందు ఏర్పాటు చేసిన వైసిపి మండల కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసిపి మండల నాయకులు మాట్లాడుతూ రాజకీయలబ్ధి కోసం ఓటర్లను ఆకట్టుకునే విధంగా టిడిపి అబద్ధపు ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రైతులకు ఎంతోమేలు కలుగుతుందని ఈ ల్యాండ్ టైటిల్ యాక్టర్ ను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ అని, ఈ యాక్టును టిడిపి ప్రభుత్వమే బాగుందని అసెంబ్లీలో మద్దతు తెలిపి ఎలక్షన్ ముందు ఈ యాక్ట్ పై ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలు నమ్మే విధంగా అపోహాలు సృష్టించారని తెలియజేశారు. మన పార్టీకి 40 శాతం ప్రజలు అండగా ఉన్న కానీ 11 సీట్లు రావడంపై ప్రజలలో అదేదో తెలియని అపోహాలు ఉన్నాయన్నారు. జగనన్న ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాడన్నారు. జగనన్న అబద్ధపు హామీలు చెప్పడని చేసేదే చెబుతారని తెలియజేశారు. ఎన్డిఏ కూటమి ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కటీ కచ్చితంగా అమలు చేయాలనీ లేకపోతే రాష్ట్ర ప్రజలెవ్వరు కూటమి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలేదన్నారు. మండలంలోని వైసిపి కార్యకర్తలు ఎవ్వరు అధైర్య పడొద్దని మనకు ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి అండగా ఉన్నారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మండల జెసిఎస్ కన్వీనర్ రవిచంద్ర రెడ్డి, మాజీ ఎంపీపీ రఘురామ్, సర్పంచ్ రామాంజినేయులు, ఉప సర్పంచ్ విజేందర్ రెడ్డి, వైసిపి నాయకులు రామలింగా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నవీన్ రెడ్డి, శివరామి రెడ్డి, మొట్రు దస్తగిరి, మొట్రూ ఈరన్న, శాంతిమూర్తి, ముని, అంజనయ్య, ముక్కరన్న, అర్లప్ప, జాము మూకయ్య, కామయ్య, ఆంజనేయ, ఎంపిపి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ గ్రామ నాయకులు పాల్గొన్నారు.