అధికారికంగా ప్రకటించిన అధ్యక్ష అబ్యర్థి ట్రంప్
వాన్స్ భార్య ఉషా చిలుకూరి..ఎపి మూలాలనున్న వ్యక్తి
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. ఎన్నికలు సవిూపిస్తున్న నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరును రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. మిల్వాకీలో సోమవారం జరిగిన సదస్సులో ట్రంప్‌కు నామినేషన్‌ను కూడా అందజేసింది. దీంతో ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా అత్యంత విధేయుడైన జేమ్స్ డేవిడ్ వాన్స్ పేరును ప్రకటించారు. కాగా
డేవిడ్ వాన్స్ భార్య భారతీయ`అమెరికన్. ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్. ఆమె మూలాలు మన ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులు భారతీయ వలసదారులుగా శాన్ ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డారు. ఉషా 1986లో పుట్టారు. ఆమె ఉన్నత విద్య అభ్యసించారు. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక ప్రతిష్టాత్మక సంస్థలో కార్పొరేట్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఆమె యేల్ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందారు. ఉషా వాన్స్ వృత్తిపరంగా కూడా మంచి ట్రాక్ రికార్డును కలిగివున్నారు. న్యాయవాదిగా నామినేట్ అవ్వడానికి ముందు ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జాన్ రాబర్ట్స్, బ్రెట్ కవనాగ్ వద్ద సహాయకురాలిగా పనిచేశారు. అంతేకాదు యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా, ది యేల్ లా జర్నల్ ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ఎడిటర్‌గా కూడా పని చేశారు. ఆమె తర్వాత ముంగెర్, టోల్లెస్, ఓల్సన్ సంస్థలకు కార్పొరేట్ న్యాయవాదిగా పనిచేశారు. యేల్ యూనివర్సిటీలో నాలుగేళ్లపాటు పాఠ్యేతర కార్యకలాపాలు నిర్వహించిన తర్వాత కేంబ్రిడ్జ్ నుంచి ఉషా చిలుకూరికి గేట్స్ ఫెలోషిప్ దక్కింది. దీంతో ఆమె తన అధ్యయనాలను కొనసాగించారు. కేంబ్రిడ్జ్‌లో వామపక్ష, ఉదారవాద బృందాలతో కలిసి పనిచేశారు. 2014లో డెమొక్రాట్ పార్టీ సభ్యురాలిగా ఆమె రిజిస్టర్ అయ్యారు. కాగా యేల్ లా స్కూల్‌లో స్కాలర్‌షిప్ పొందిన జేమ్స్ డేవిడ్ వాన్స్‌తో ఉషా చిలుకూరికి పరిచయం అయ్యింది. ఒకరినొకరు ఇష్టపడడంతో 2014లో ఈ జంట కెంటుకీలో పెళ్లి చేసుకున్నారు. ఒక హిందూ పూజారి ప్రత్యేక నిర్వహించిన వేడుకలో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉషా వాన్స్ తన భర్త జేమ్స్ డేవిడ్ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. అమెరికా గ్రావిూణంలో దిగజారుతున్న పరిస్థితులపై ఆయన ఆలోచనలకు ఒక రూపం తీసుకొచ్చి ’హిల్‌బిల్లీ ఎలిజీ’ పేరిట బుక్‌గా రూపాంతరం చెందించారు. ట్రంప్ కుటుంబానికి వాన్స్ ఎలా దగ్గరయ్యారు వంటి ఆసక్తికరమైన విషయాలను ఇందులో పొందుపరిచారు. 2016లో ఈ బుక్ అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. గ్రావిూణ అమెరికా ప్రజలు ట్రంప్‌ను ఏవిధంగా అధికారంలోకి తీసుకొచ్చారో ఈ బుక్‌లో వివరించారు. ఇక ఒహియో సెనేట్ సీటులో గెలుపు కోసం డేవిడ్ వాన్స్ ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఆమె తనవంతు సహకారం అందించారు. జేమ్స్ డేవిడ్ వాన్స్`ఉషా చిలుకూరి వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఇవాన్( 6), వివేక్(4), మిరాబెల్(2). రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా తన భర్త ఎంపికైన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. మా జీవితాల్లో ఏ మార్పు రావాలని కోరుకోవడం లేదు. కానీ జేమ్స్‌పై నాకు నమ్మకం ఉంది. అతనంటే నాకు చాలా ప్రేమ. జీవితంలో ఏం జరుగుతుందో వేచిచూద్దాం‘ అని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. మరో ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను మతపరమైన కుటుంబంలో పుట్టి పెరిగాను. నా తల్లిదండ్రులు హిందువులు. హిందుమతం వారిని మంచి తల్లిదండ్రులను చాలా మంచి వ్యక్తులుగా మార్చింది. అది చూస్తూ నేను పెరిగాను. జేమ్స్ వాన్స్ దేని కోసం ఆరాటపడుతున్నాడో నాకు. అది అతనికి సరైనదనిపించింది‘ అని ఆమె చెప్పారు. కాగా అమెరికా రాజకీయ వ్యవస్థలో భారతీయుల ప్రాబల్యం, మన సంస్కృతికి అక్కడి రాజకీయ నాయకులు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో తెలియజేస్తోంది. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. మిడిల్‌టన్‌లో జన్మించిన జె.డి.వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. కఠినమైన ఆర్థిక పరిస్థితుల మధ్య పెరిగారు. వాన్స్ తండ్రి చిన్నప్పుడే వారిని వదిలి వెళ్లిపోయారు. తల్లి మాదకద్రవ్యాలకు బానిసయ్యారు. దీంతో వాన్స్ తాతయ్య దగ్గర పెరిగారు. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ,
యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు. యేల్ లా జర్నల్‌కు సంపాదకుడిగా ఉన్నారు. ఆయన రచించిన ’హిల్‌బిల్లీ ఎలెజీ’ పుస్తకం అత్యధికంగా అమ్ముడు కావడంతో పాటు సినిమాగా రూపొందింది. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. 39 ఏళ్ల వాన్స్ 2022లో అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను విమర్శిస్తూ వచ్చి చివరకు విధేయుడిగా మారారు. యేల్ లా స్కూల్‌లోనే ఉషా, జె.డి.వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. ప్రత్యేకంగా హిందూ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవడం విశేషం.