కాకినాడ, జూలై 20 : జైభీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా న్యాయవాది జగ్గారపు మల్లిఖార్జున ను నియమించారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున మాట్లాడుతూ గడిచిన ఆరు సంవత్సరాల నుండి పార్టీలో క్రమశిక్షణతో ఉండి, కాకినాడ జిల్లా అధ్యక్షునిగా, పార్టీ రాష్ట్ర వర్కింగ్ జనరల్ సెక్రెటరీగా ఇప్పటివరకూ పనిచేశానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రజా సమస్యలపై కోర్టులలో, ప్రజాక్షేత్రంలో నిరంతరం పోరాటాలు చేశామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వంపై కూడా పోరాడటానికి సిద్ధమని మల్లిఖార్జున తెలిపారు. ప్రజాక్షేత్రంలో ప్రజలే దేవుళ్ళనీ, ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ జైభీమ్ రావ్ భారత్ పార్టీ అనీ, ఇలాంటి పార్టీలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చిన అధ్యక్షులు శ్రావణ్ కుమార్ కి మల్లిఖార్జున ధన్యవాదాలు తెలిపారు.