మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే బీజేపీదే బాధ్యత అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి ఆతిశీ స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌ను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సరైన రీతిలో వైద్య సహాయం అందించకుండా చంపాలని బీజేపీ పథక రచన చేసిందని ఆరోపించారు. కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు.