సివిల్స్ ఎంపికలో వికలాంగ కోటాపై పోస్ట్
తేనెతుట్టెను కదపడంతో పలువురు విమర్శలు
ట్రైనీ ఐఎఎస్ అధికారి పూజా ఖేద్కర్ వివాదం తర్వాత ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం గురించి కొత్త చర్చ మొదలైంది. ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ విూడియా ఖాతా ’ఎక్స్’లో పంచుకున్నారు. ఈ చర్చ ప్రస్తుతం ఊపందుకుంది. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? లేదా విూరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా అంటూ పోస్ట్ చేశారు. సివిల్ సర్వీసెస్ అధికారుల బాధ్యత అనేది ఫీల్డ్ వర్క్, పన్నులు విధించడం, ప్రజల మనోవేదనలను నేరుగా వినడం వంటివి ఉంటాయి. కాబట్టి ఈ ప్రీమియర్ సర్వీస్‌కు ఈ కోటా అవసరమా అని తన అభిప్రాయాలను వెల్లడిరచారు. స్మిత సబర్వాల్ పోస్ట్ చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వికలాంగుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. వికలాంగులను ’సంకుచిత దృక్పథం’తో చూడరాదని, వారి అర్హతపై ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు. దీనిపై శ్రీకాంత్ మిర్యాల అనే రచయిత, సైకియార్టిస్ట్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో ప్రత్యక్ష ఉదాహరణలతో గతంలో ఎంబీబీఎస్ చదివేటప్పుడు తన ప్రిన్సిపాల్ కాలుకి పోలియో సోకి సరిగా నడవలేనివారు, అయినా కూడా ఎడమచేత్తో రాసి, పాఠాలు చెప్పారాని గుర్తు చేశారు. ఇలా అనేక మంది దివ్యాంగులు పలు రంగాల్లో ఉన్నట్లు గుర్తు చేశారు. అంతేకాదు ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు ఇలా ట్వీట్ చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. విూ పని విూరు సరిగ్గా చేయండి చాలు. అంతేకానీ విూకు
సలహాలు ఇచ్చే స్థాయి ఇంకా రాలేదని చెబుతున్నారు. అంతేకాదు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఈ అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌పై అనుచిత ప్రవర్తన ఆరోపణల మధ్య ఈ వివాదం మొదలైంది. యూపీఎస్‌సీ పరీక్షలో తన అభ్యర్థిత్వాన్ని పొందేందుకు వైకల్యం, ఇతర వెనుకబడిన తరగతి కోటాను దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఫేక్ ఐడెంటిటీ ఇచ్చి అనుమతించిన దానికంటే ఎక్కువ ప్రయత్నిం చారనే ఆరోపణలపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖేద్కర్‌పై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో స్మిత వ్యాఖ్యలు పలువురి విమర్శలకు కారణమయ్యింది.