Search
Close this search box.

బోయిన్‌పల్లిలో భార్య,కూతురు ను చంపి:భర్త ఆత్మహత్య

సికింద్రాబాద్‌ బోయినపల్లి లో ఈరోజు తెల్లవారు జామున దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య, 11 నెలల కన్న కూతుర్ని ఓ వ్యక్తి దారు ణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ బోయిన్‌ పల్లి లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

గణేష్, స్వప్న దంపతులు. వీరి ముగ్గురు కుమార్తెలు సంతానం. గణేష్ డ్రైవర్‌గా పని చేస్తుండగా.. కుటుంబం తో సహా.. న్యూ బోయిన్ పల్లి పెద్దతోకట్టలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

అయితే గత కొద్దిరోజులుగా భార్య భర్తల మధ్య గొడవ లు జరుగుతున్నట్లు సమాచారం. శనివారం రాత్రి కూడా దంపతుల మధ్య గొడవలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. 

ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున గణేష్ తన భార్య స్వప్న, చిన్న కుమార్తె నక్షత్రలను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం 100కు కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. తాను కూడా చనిపోతు న్నట్లు పోలీసులకు వెల్లడించారు. 

అప్రమత్తమైన పోలీసులు గణేష్ ఇంటికి వెళ్లి చూసే సరికి భార్య, కుమార్తె విగతజీవులుగా పడి ఉన్నా రు. గణేష్ అల్వాల్‌లోని ఓ రైల్వే ట్రాక్‌పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తు న్నారు. గత కొంత కాలంగా భార్యపై గణేష్ అనుమానం పెంచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమెను హత్య చేసి ఉండవ చ్చుననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

కాగా, తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. వీరి దీనస్థితిని చూసిన స్థానికులు కంట తడి పెట్టుకుంటున్నారు. క్షణికావేశంలో హత్యలు చేసి ఇద్దరు పిల్లలను అనా థలను చేశారని స్థానికులు గణేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే హత్యలకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి