Search
Close this search box.

వైసిపి హయాంలో చేపట్టిన పనుల్లో డొల్ల

మంజూరైన నిధులకు, పనులకు కానరాని పొంతన

ఉద్దానం వాటర్‌ ప్రాజెక్ట్‌ పై మాజీ సీఎం జగన్‌ హడావిడి 

ఇచ్చాపురం పర్యటనలో అధికారులతో మంత్రి రామ్మోహన్‌ సవిూక్ష

వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన చాలా పనుల్లో డొల్లతనం సవిూక్షల్లో బయటపడుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఇరిగేషన్‌, రూరల్‌ వాటర్‌ స్కీమ్‌, పంచాయతీరాజ్‌, పథకాల్లో గతంలో మంజూరైన నిధులు పనులకు పొంతన లేదని చెప్పారు. ఉద్దానం వాటర్‌ ప్రాజెక్ట్‌ పై మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి హడావిడి చేశారని అన్నారు. 400 గ్రామాలకు మంచి నీరు అందితుందని.. ఇంకా 700 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని తెలిపారు. జిల్లా దశ దిశను మార్చే నదుల అనుసంధానంపై ప్రత్యేక కార్యాచరణలో ముందుకు వెళ్తామని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. ఇచ్చాపురంలో శుక్రవారం కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలుగుదేశం కంచుకోట ఇచ్ఛాపురం నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. సాదరంగా ఆహ్వానం పలికిన కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ స్వేచ్ఛ వతి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం ఇచ్ఛాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బెందాళం అశోక్‌తో కలిసి స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సవిూక్ష నిర్వహించారు. మున్సిపాలిటీ, మండలంలోని ప్రధాన సమస్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా కలిసి సమస్యలను పరిష్కరిస్తాం అని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్‌ శ్రీ దాసరిరాజు , మున్సిపల్‌ చైర్మన్‌ ముఖ్య అధికారులు నాయకులు పాల్గొన్నారు. ఇదిలావుంటే మైక్రోసాప్ట్‌కు సంబంధించిన 365 యాప్స్‌ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, విూడియా సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడిరది. ఆ క్రమంలో లండన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌లో సేవలు నిలిచిపోయాయి. ఈ సేవలు నిలిచిపోవడంతో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. మైక్రోసాప్ట్‌ సాంకేతిక సమస్య కారణంగా పౌరవిమాన యాన శాఖకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. కొద్దిసేపటి క్రితం విమానయాన శాఖ అధికారులతో మాట్లాడానని వివరించారు. విమానయాన రంగంపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి