Search
Close this search box.

బడ్జెట్‌ సామాన్యులకు చిక్కేనా ? 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ తరవాత ఎన్నికలు..ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత పూర్తిస్థాయి బడ్జెట సమావేశాలు మొదలయ్యాయి. ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న అనేక అంశాలకు, సమస్యలకు పార్లమెంట్‌ జవాబుదారీ కావాలి. ప్రజలకు తాము అండగా ఉన్నామన్న సంకేతం వెళ్లాలి. అప్పుడే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. ఇకపోతే దేశానికి దశాదిశానిర్దేశం చేసేలా బడ్జెట్‌ పద్దులు ఉండాలి. బడ్జెట్‌ అనగానే దేశ అభివృద్ది ముఖచిత్రం కనిపించాలి. అంకెలా గారడీ కాకుండా దేశాన్ని నిలబెట్టేలా, ఆపపన్నులను ఆదుకునేలా, భవిష్యత్‌ దర్శనం చూపేలా ఉండాలి. కానీ ఏటా మొక్కుబడి బడ్జెట్‌ ప్రసగాలు సాగుతున్నాయి. గత పదేళ్లలో ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న వారికి ఏ రకంగానూ బడ్జెట్‌లో ఏరడిరపు కలగలేదు. ఈ క్రమంలో మంగళవారం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌పై దేశ ప్రజల్లో సహజంగానే ఆసక్తి కలుగుతోంది. గత పదేళ్లకు భిన్నంగా బడ్జెట్‌ ఉంటుందా అన్న ఆసక్తి, ఉత్కంఠ కూడా కలుగుతోంది. తొలిసారి సంకీర్ణంలోకి అడుగుపెట్టిన మోడీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్‌ కావడంతో విపక్షాలతో సహా, అన్ని తరగతుల ప్రజలు కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా ఆసక్తి కనబరు స్తున్నారు. దీంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై సర్వత్రా చర్చ సాగుతోంది. ఇకపోతే దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏడోసారి కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతకుముందు పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్‌ పేరిట వరుసగా ఏడు బడ్జెట్‌లు సమర్పించిన రికార్డు నమోదు కానుంది. ఇప్పటి వరకు ఈ రికార్డు మొరార్జీ దేశాయ్‌ పేరిట ఉంది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవస్థలోని వేర్వేరు వాటాదారులతో చాలాసార్లు చర్చలు జరిపింది. విద్య, ఆరోగ్య రంగం, క్యాపిటల్‌ మార్కెట్‌, ఉపాధి, నైపుణ్యాలతో పాటు రంగాలకు చెందిన అధికారులు, ప్రతినిధులతో చర్చలు జరిపారు. పలువురు ఆర్థికవేత్తలతోనూ ఆర్థిక మంత్రి సమావేశమయ్యారు. బడ్జెట్‌లో ద్రవ్యలోటు తగ్గింపుపై దృష్టి సారించాలని ఆర్థికవేత్తలు కేంద్రానికి సూచించారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని రైతు సంఘాలు ఆర్థిక మంత్రిని కోరాయి. ఇకపోతే ఈసారి కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్టాల్రకు ప్రాధాన్యత దక్కాలని ఈ రెండు రాష్టాల్రు కోరుకుంటున్నాయి. రెండు రాష్టాల్ర సిఎంలు పలుమార్లు కేంద్రమంత్రులను కలిసి ఇప్పటికే వివిధ అంశాలపై వినతులు సమరపించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోదీ సహా కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోనూ ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచు కోవడంతో.. రాష్టాన్రికి గతానికంటే ఎక్కువ లబ్ది చేకూరేలా నిర్ణయాలు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. గతంలో లాగానే బడ్జెట్‌ 2024 కూడా పేపర్‌లెస్‌ ఫార్మాట్‌లో ఉండనుంది. బడ్జెట్‌ పత్రాలు హిందీ, ఇంగ్లీష్‌ మాత్రమే అందుబాటులో ఉంటాయి. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన అన్ని పత్రాలు ’యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌’లో అందుబాటులో ఉంటాయి. దీంతో పార్లమెంట్‌ సభ్యులు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బడ్జెట్‌ పత్రాలు అందుతాయి. బడ్జెట్‌ సమర్పించిన కొద్దిసేపటికే అన్ని పత్రాలు ఈ యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ సారి బడ్జెట్‌ లో కేంద్రం ప్రజాకర్షక విధానాలవైపే మొగ్గుచూప బోతున్నట్టు తెలిసింది. ఆదాయపన్నుల్లో ఉపశమనం, కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ఇళ్ల నిర్మాణాలకు ఊతమిచ్చే 

విధంగా నిర్ణయాలు ఉండబోతున్నట్లు తెలిసింది. మరోవైపు ఆదివారం అఖిలపక్ష స మావేశం జరిగింది. ఇందులో సంఘటిత ప్రతిపక్షాలు పలు కీలక విషయాలను ప్రభుత్వం ముందుంచాయి. విపక్షం బలంగా ఉండడం వంటి కారాణాల వల్ల పార్లమెంట్‌ సమావేశాల్లో ఇక దాటవేత ధోరణి కుదరదు. ప్రత్యేకించి నీట్‌ వివాదం, పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వంటి విషయాలపై సభలలో చర్చకు అవకాశం ఇవ్వాల్సిందే అని ప్రతిపక్షాలు అఖిలపక్షంలో పట్టుపట్టాయి. అనుకున్నట్లుగానే తొలిరోజే అంటే సోమవారమే దీనిపై విపక్ష నేత రాహుల్‌ ప్రస్తావించారు. చర్చకు పట్టుబట్టారు. అలాగే అనేకమైన ప్రజల అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్‌తో పాటు, ప్రజా సమస్యలపై సహేతుకమైన సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉండాల్సిందే. గతంలో లాగా వాయిదాలు వేయడం,దాటవేయడం, ఎంపిలను సస్పెండ్‌ చేయడం లాంటి చర్యలు కదరవని గుర్తించాలి. ఇక ప్రభుత్వానికి కూడా సభా నిర్వహణలో అందరి మద్దతు అవసరం. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధం అని అఖిలపక్షంలో కేంద్రమంత్రులు వెల్లడిరచారు. అయితే ఏదైనా కూడా సభా నిబందనలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. వీటిని అంతా పాటించాల్సిందేనని ప్రతిపక్ష నేతలకు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. సభ అందరిదీ, సమిష్టి సహకార వైఖరితోనే నిర్ణీత రీతిలో సభలు నిర్వహించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో విపక్షాలు కూడా సమర్థంగా పనిచేయాల్సి ఉంటుంది. కేవలం గొడవలు సృష్టించేందుకు కాకుండా ఉమ్మడిగా సమస్యలపై చర్చించి ప్రభుత్వాన్ని నిలదీయగలగాలి. ఏదేమైనా సమావేశాలు అన్నవి ప్రజలకు సంబంధించినవిగా అటు ప్రభుత్వం, ఇటు విపక్షం గుర్తించాలి. ఇవి తమ ప్రతిష్టకు సంబంధించినవిగా చూడరాదు. ప్రతిష్టకు, పంతాలకు కూడా ఇది సమయం కాదు. ప్రజల సమస్యలపై పార్లమెంట్‌ జవాబుదారీగా వ్యవహరించాలి. గతంకన్నా భిన్నంగా సభ సాగిందన్న పేరు రావాలి. అప్పుడే దేశంలో నాయకులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలపడుతుందని గుర్తించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి