Search
Close this search box.

బైడెన్‌ పట్ల డెమాక్రట్లలో అసమనం

అభ్యర్థిత్వం మార్చాలన్న డిమాండ్‌

తప్పుకుంటేనే మంచిదన్న ఒబామా

కమలాహ్యారిస్‌ వైపు అందరి చూపు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. ఓ వైపు దాడి తర్వాత మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తనదైన శైలిలో దూకుడుతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నప్పటికీ.. డెమోక్రాట్లలో ఆయన ఆరోగ్య పరిస్థితి పార్టీలో టెన్షన్‌ పుట్టిస్తోంది.. ఇలా అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అధికార డెమోక్రాటిక్‌ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ తీరు, వ్యవహార శైలి పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆయనను మార్చాలనే డిమాండ్లు సొంత పార్టీలోనే వెల్లువెత్తుతున్నాయి. బైడెన్‌కు ప్రత్యామ్నాయం కమలా హ్యారీస్‌ అన్న విషయం బాగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని బైడెన్‌ వర్గాలు కూడా నిజమే అన్నట్లు తలూపుతున్నారు. దాదాపు చాలా మంది బైడెన్‌ కంటే కమలా హ్యారిస్‌ బెటర్‌ అంటూ పేర్కొంటుండటం సంచలనంగా మారింది..ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరపున జో బైడెన్‌ మరోసారి రేసులో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. పలుమార్లు సభల్లో వింతగా ప్రవర్తించారు. దీనికి తోడు ప్రత్యర్థి రిపబ్లికన్‌ నేత ట్రంప్‌.. 

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో బైడెన్‌ కు వ్యతిరేకంగా డెమోక్రాట్లలో అసహనం వ్యక్తం అవుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై జో బైడెన్‌ పునరాలోచించాలని భావిస్తున్నట్లు మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తెలిపారు. బైడెన్‌ విజయావకాశాలు సన్నగిల్లినట్లు ఒబామా అంచనా వేస్తున్నారు. బైడెన్‌ తన అభ్యర్ధిత్వాన్ని మరోసారి ఆలోచించాల్సి వస్తుందన్నారు. వాషింగ్టన్‌ పోస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తమ పార్టీ నేతలకు కూడా చెప్పినట్లు ఒబామా పేర్కొన్నారు. ఒబామా దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. 2009 నుంచి 2017 వరకు జో బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా చేశారు. ఈసారి రేసు నుంచి బైడెన్‌ తప్పుకోవాలని చాలా మంది డెమోక్రాట్లు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఒబామా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ప్రస్తుతం బైడెన్‌ కోవిడ్‌తో బాధపడుతున్నారు. ఆయన తన ఇంట్లోనే ఉన్నారు. కానీ తన వయసు, ఫిట్‌నెస్‌ విషయంలో వస్తున్న ఆరోపణలను ఆయన ఖండిరచారు. వైట్‌హౌజ్‌కు రేసులోనే ఉన్నట్లు కూడా వెల్లడిరచారు. గతవారం రిపబ్లికన్‌ ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన డిబెట్‌లో బైడెన్‌ తడబడ్డారు. కొన్నిసార్లు అసంబద్దమైన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు డెమోక్రాట్లను కలవరానికి గురిచేస్తున్నాయి. రెండోసారి అమెరికా అధ్యక్షునిగా సర్వీస్‌ చేసేందుకు ఆయన సమర్థత సరిపోదనే మాట వినిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవల న్యూస్‌ ఏజెన్సీలు జరిపిన సర్వేలు కూడా బైడెన్‌కు ప్రత్యామ్నాయం కమలా హరీస్‌ అని చెబుతున్నాయి. ఈ సర్వేల్లో ట్రంప్‌`బైడెన్‌ ఇద్దరి కంటే 6 పాయింట్ల ముందంజలో కమలా హరీస్‌ ఉన్నారట. డెమోక్రాట్లలోని 10మందిలో ఆరుగు కమలా హ్యారిస్‌ కు మద్దతు తెలపగా.. ఇద్దరు సూటవ్వరని.. మరో ఇద్దరు తెలియదని చెప్పినట్లు ఓ సర్వే తెలిపింది.. మెజారిటీ డెమొక్రాట్‌లు కమలా హారిస్‌ వైపు నిలుస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. రిపబ్లికన్‌ అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడిరచే సత్తా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ఉందని పలువురు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి