Search
Close this search box.

రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రత

ప్రజల్లో ఆగ్రహానికి దారితీసేలా అరాచక పాలన

పార్లమెంటులో అరచాకాలపై గళమెత్తండి

రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేయండి

ఎంపిల సమావేశంలో వైఎస్‌ జగన్‌ సూచన

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తీవ్ర వైఫల్యం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీని అణగదొక్కడం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాధ్యం కాదని, పైగా ఈ అరాచక పాలన ప్రజల్లో ఆగ్రహానికి దారి తీస్తుందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రపతి పాలనకు డిమండ్‌ చేయాలని ఎంపీలకు జగన్‌ సూచించారు. చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికల పంపాలని తెలిపారు. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదన్నారు. రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామన్నారు. బుధవారం నాడు ఢల్లీిలో నిరసన తెలుపుతామన్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రుల అపాయింట్‌మెంట్లను కోరానని… అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీవిూద దాడులు చేయడం అనేది ధర్మమా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని.. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయన్నారు. వినుకొండలో జరిగిన హత్యా ఘటన పరాకాష్ట. వీడియో దృశ్యాలు చూస్తే.. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డువిూద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషం. అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్‌ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది. రషీద్‌ వైన్‌షాపులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. జరిగిన ఘటనను వక్రీకరించడానికి ఎల్లోవిూడియా సహాయంతో ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో బైక్‌ కాల్చిన ఘటనకు, జరిగిన దారుణహత్యకు ముడిపెట్టే ప్రయత్నంచేస్తున్నారు. కాలిన బైక్‌.. వైఎస్సార్‌సీపీ వాళ్లది, దీనికి సంబంధించిన కేసు కూడా నమోదయ్యింది. దాన్ని ట్విస్ట్‌ చేసి నానా తప్పుడు రాతలు రాస్తున్నారు.‘ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల విూద దారుణంగా దాడులు జరగుతున్నాయన్నారు. వినుకొండలో జరిగిన హత్యా ఘటన పరాకాష్ట అన్నారు. వీడియో దృశ్యాలు చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయో తెలుస్తుందన్నారు. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డువిూద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషమన్నారు. రాజకీయ ప్రత్యర్థులకు, వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్‌ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది 

అంటూ మాజీ సీఎం విరుచుకు పడ్డారు. జరిగిన ఘటనను వక్రీకరించడానికి ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఇప్పటి వరకు 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారన్నారు. వేయికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయన్నారు. తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు చేశారన్నారు. టీడీపీ మనుషులను అక్కడ కావాలని ఉంచేలా పోలీసులతో ఎª`లాన్‌చేసి దాడులు చేశారని అన్నారు. మాజీ ఎంపీ రెడ్డప్ప, న్యాయవాది అయిన రెడ్డప్ప ఇంటికి వెళ్తే దాడులు చేశారన్నారు. తప్పులు వారు చేసి తిరిగి వైసీపీ వాళ్లవిూద కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుందన్నారు. ఢల్లీిలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీకి, ఒక్కో బాధ్యత అప్పగించాలని జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. గత ఎన్నికల్లో మనం 86శాతం సీట్లను గెలిచామన్నారు. వైయస్సార్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు… ఓటు వేయని వారికి కూడా ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇచ్చామన్నారు. ప్రజలిచ్చిన వాగ్దానాల అమలు కాకపోవడంపై ఎవ్వరూ ప్రశ్నించకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఎక్కడ కార్యకర్తలకు నష్టం జరిగినా వెంటనే స్పందించడం, వారిని కాపాడుకోవడం బాధ్యత అని చెప్పుకొచ్చారు. కార్యకర్తలందరి తరపున గట్టిగా నిలబడాలన్నారు. రాష్ట్రంలో వైయస్సార్‌సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని… వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ‘మన పోరాటం ద్వారా గట్టి ఒత్తిడి తీసుకురావాలి‘ అని ఎంపీలకు జగన్‌ మోహన్‌ రెడ్డి దిశానిర్దేశర చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి