Search
Close this search box.

రెడ్‌బుక్‌ తెరవక ముందే ఢల్లీిలో గగ్గోలు

అదేదో అసెంబ్లీకి వచ్చి చేస్తే..సమాధానం ఇచ్చేవాళ్లం

జగన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి లోకేశ్‌

ఇంకా రెడ్‌ బుక్‌ తెరవక ముందే జగన్‌ ఢల్లీి దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నారంటూ మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యలు చేశారు. పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జాతీయ విూడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్ళిపోయారన్నారు. రెడ్‌బుక్‌కు మాత్రం జాతీయ విూడియా వెంటపడి బతిమాలి, పిలిపించి మరీ ప్రచారం కల్పించారంటూ ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల కాలంలో జగన్‌ రెండు విూడియా సమావేశాలు పెడితే… 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో ఐదు విూడియా సమావేశాలు పెట్టారని చెప్పుకొచ్చారు.ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిసాయి. ఈ క్రమంలో అసెంబ్లీ చివరి రోజు కావటంతో విద్య, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్‌కు వినతులు వెల్లువెత్తాయి. శుక్రవారం నాడు లోకేష్‌ను పలువురు నామినేటెడ్‌ పదవుల ఆశావహులు కలిశారు. ఈ సందర్భంగా తమ తమ బయోడేటాలు మంత్రికి ఆశావాహులు అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేష్‌ వారికి హావిూ ఇచ్చారు. అనంతరం ఆయన అసెంబ్లీ లాబీలో విూడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. తన దగ్గర రెడ్‌ బుక్‌ ఉందని తానే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పానన్నారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్‌ బుక్‌లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. జగన్‌ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే వాస్తవాలు తాము వివరిస్తాం కదా అని అన్నారు. జగన్‌ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామని తెలిపారు. వైసీపీ నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతలు తిట్టరని.. జగన్‌ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచరని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. కాగా.. ‘ఏపీలో హింసాకాండ‘ అంటూ ఇటీవల ఢల్లీిలోని జంతర్‌ మంతర్‌ వద్ద వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పాలన విధించాలంటూ పార్టీ నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ఏపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఆంధప్రదేశ్‌లో హింసాకాండ చెలరేగిపోతోందని.. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాడులు, దౌర్జన్యాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఏపీలో లోకేశ్‌ రెడ్‌ బుక్‌ పాలన సాగుతోందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ దుయ్యబట్టారు. ఢల్లీిలో చేపట్టిన ధర్నాలో జగన్‌ పదేపదే లోకేష్‌ రెడ్‌ బుక్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే వైసీపీ అధినేత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. జగన్‌కు రెడ్‌ బుక్‌ అంటే భయంపట్టుకుందని… ఢల్లీి వెళ్ళి అక్కడ కూడా రెడ్‌ బుక్‌ అని మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి