Search
Close this search box.

రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబు అబద్దాలు

తప్పుడు ప్రచారాలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం

52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం

లెక్కలు చూపాల్సి వస్తుందనే బడ్జెట్‌ పెట్టడం లేదు

శ్వేత పత్రాలతో మభ్య పెట్టే యత్నం 

విూడియా సమావేశంలో మాజీ సిఎం జగన్‌

రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని 

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విూడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం తిరోమనంలో వెళ్తోందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 52 రోజుల్లో రాష్ట్రంలో అక్రమాలు, ఆకృత్యాలు పెరిగిపోయాయని ఆరోపణలు గుప్పించారు. ప్రశ్నించే వాళ్లను అణచివేస్తున్నారు. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విధ్వంస పాలన సాగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. బడ్జెట్‌ కూడా పెట్టలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్‌ పెడితే బాబు హావిూలకు లెక్కలు చూపాల్సి వస్తుంది. అందుకే బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి వెనకడుగేస్తున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బాబు పాలనలోనే రాష్ట్రం ఆర్థికంగా దిగజారిందని జగన్‌ అన్నారు. ఎన్నికల సమయంలో 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతూ.. సూపర్‌ సిక్స్‌ హావిూలు జగన్‌ విమర్శించారు. ‘ఇప్పుడు అధికారం వచ్చాక అది చూపించడానికి ఇబ్బందులు పడుతున్నారు. గవర్నర్‌ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్ల అప్పు అయ్యిందని చూపించారు. శ్వేత పత్రాలతో మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. ఆర్బీఐ, కాగ్‌, రాష్ట్ర బ్జడెట్‌ లెక్కల ప్రకారం 2024 జూన్‌ వరకు కూటమి సర్కార్‌ గ్దదెనెక్కేవరకు రూ.5 లక్షల 18 వేల కోట్ల అప్పు మాత్రమే అయింది. చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేశారు. వైసీపీ హయాంలో 12.9 శాతం అప్పు చేశాం. కేంద్ర ఆర్థిక సర్వే మా ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంది. బ్జడెట్‌లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే పూర్తిస్థాయి బడ్జెట్‌ పెట్టడం లేదు. 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం సరికాదు’ అని జగన్‌ అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎటు వైపు వెళ్తుందో ఆలోచించాలని, పురోగతి వైపు వెళ్తుందా?.. తిరోగమనంలో వెళ్తోందా? గమనించాలని ఏపీ ప్రజలకు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకాలు, చంద్రబాబు విడుదల చేస్తున్న అబద్ధపు శ్వేత పత్రాలు, వైఎస్సార్‌సీపీ హయాంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపై తాడేపల్లిలోని తన కార్యాలయంలో జగన్‌ విూడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. ప్రశ్నించే వాళ్లను అణచివేసే ధోరణితో పాలన ముందుకు సాగుతోంది. విధ్వంస పాలన కొనసాగుతుంటే.. పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడు నెలల ఓటాన్‌ బ్జడెట్‌ పెడుతోంది. పూర్థిస్థాయి బ్జడెట్‌ పెట్టే ధైర్యం లేంటే ఎంతటి దారుణమైన, అధ్వానమైన పాలనో అర్థం చేసుకోవాలి. ఫుల్‌ బ్జడెట్‌ పెడితే చంద్రబాబు నాయుడు మోసపూరిత హావిూలు ఏమైతే ఇచ్చారో.. వాటికి కేటాయింపులు చూపించాల్సిన అవసరం వస్తుంది. అందుకే ఆ పని చేయడం లేదు. చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి రూ.2 లక్షల 72 వేల కోట్ల అప్పు ఉంది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆ అప్పు రూ.5 లక్షల 18 వేల కోట్లకు చేరింది. గ్యారెంటీలు, విద్యుత్‌ ఒప్పందాలు కలిపినా రూ. 7లక్షల 48 వేల కోట్లు మాత్రమే. అయినా గవర్నర్‌ ప్రసంగంలో అబద్ధం చెప్పించారు. ఇలా రూ. 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ధర్మమా?. వాస్తవాలపై గవర్నర్‌కు లేఖ రాస్తాం. ఆయనతోనూ అబద్దాలు చెప్పించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తాం. చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి రూ.7 వేల కోట్లకు పైగా ఖజానా సొమ్ము ఉంది. కానీ, మేం అధికారం చేపట్టేనాటికి రూ.100 కోట్లే ఉంది. ఆ విషయాన్ని ఈనాడు కూడా రాసింది. మేం అధికారంలో ఉండగా మేనిఫెస్టోలో ప్రతీ హావిూని అమలు చేశాం. డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి రూ.2.71 లక్షల కోట్లు లబ్దిదారులకు జమ చేశాం. పార్టీ, ప్రాంతాలు కూడా చూడకుండా అందరికీ సంక్షేమం అందించాం. చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 12.9 శాతం అప్పు 

చేశాం. కేంద్ర ఎకనామిక్‌ సర్వే మా ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంది. అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమైనట్లు చిత్రీకరించడం ఎంత వరకు సమంజసం?. బ్జడెట్‌లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే పూర్తిస్థాయి బ్జడెట్‌ పెట్టడం లేదు. అసలు లేని రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ధర్మమా?. చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 12.9 శాతం అప్పు చేశాం. కేంద్రం ఇచ్చిన అనుమతుల కన్నా తక్కువ అప్పే చేశాం. కోవిడ్‌ టైంలోనూ పూర్తి స్థాయి బ్జడెట్‌ పెట్టాం. ఆ టైంలో కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గింది. అయినా సంక్షేమం ఆపలేదు. ఈ లెక్కన ఎవరు ఆర్థికంగా ధ్వంసం చేసినట్లు? కేంద్ర ఎకనామిక్‌ సర్వే మా ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంది. కేవలం.. బ్జడెట్‌లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ పెట్టడం లేదన్నారు. 2019`24మధ్య రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై శ్వేతపత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సభ ముందు ఉంచారు. అయిదేళ్ల పాటు పట్టిసీమను ఆపరేట్‌ చేయలేదని వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి