Search
Close this search box.

కర్ఫ్యూల మధ్య బతికే వారి జీవితాల్లో వరల్డ్ కప్ వెలుగులు!

వరల్డ్ కప్

           ప్రతి మనిషికి స్వేచ్ఛ అనేది చాలా ప్రధాన మైనది. అలా కానీ జీవితం ఎంతకాలం బ్రతికినా వృథానే. కొన్ని దేశాల్లో స్వేచ్ఛ అనేది మచ్చుకు కూడా కనిపించదు. కఠినమైన ఆంక్షల మధ్య బయట తిరుగుతున్నా జైలు జీవితాన్నే అనుభవిస్తుంటారు. జీవితంపై పెద్దగా ఆశలు, ఆలోచనలు అక్కడి ప్రజలకు ఉండవు. అలాంటి స్థితిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పౌరులల్లో టీ-20 వరల్డ్ కప్ వెలుగులు తెచ్చింది. అక్కడి వారికి జీవితాలపై ఎటువంటి ఆశలు లేకున్నా.. క్రికెట్ ఆట ఒక్కటే ఎండారిలో ఓయాసిస్ లా వారికి సంతోషాన్ని ఇస్తుంది. విచ్ఛిన్నమైన ఆ ప్రాంతాన్ని, ఆ మనుషులను క్రికెట్ ఆట కలిపింది. వారి జీవితాలపై ఆశలను రేకెత్తంచింది. ఇది కేవలం ఒక ఆఫ్ఘన్ క్రికెటర్ కథ కాదు..ప్రతి ఆఫ్ఘన్ పౌరుడి కథ.

ఆఫ్ఘనిస్తాన్ దేశం ప్రస్తుతం తాలిబన్ల పాలనలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లడంతో.. ప్రజాపాలన నుంచి తాలిబన్ల పాలన ఆ దేశం వెళ్లింది. దీంతో అక్కడ దారుణాతి దారుణైన ఆంక్షలను తీసుకొచ్చింది. తాలిబన్ల ప్రభుత్వం. ముఖ్యంగా ఆడపిల్లలపై అనేక కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. చదువుకు, స్వేచ్ఛ వంటి విషయాల్లో అక్కడి యువతులపై ఆంక్షలు విధించారు. అంతేకాక మగవారికి సైతం అనేక నిబంధనలు అక్కడి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. అక్కడ అంతా కర్ఫూ వాతావరణం కనిపిస్తుంది.  దీంతో అలాంటి పరిస్థితులకు అలవాటు పడిన ఆఫ్ఘన్ ప్రజలు..జీవితంపై ఆశలు చంపుకున్నారు. పెద్ద పెద్ద కోర్కెలు ఏమి లేకుండా జీవితాన్ని వెల్లదీస్తున్నారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో కూడా వారికి ఒక్కటి మాత్రం సంతోషాన్ని ఇస్తుంది. అదే క్రికెట్.. ఈ దేశం నుంచి క్రికెట్ టీమ్ అంతర్జాతీయ స్థాయిలో ఆడుతుంది. ఆ టీమ్ ప్లేయర్ కూడా తమ దేశ పరిస్థితి, తమ వారి పడుతున్న కష్టాలను సైతం గొంతులో దాచుకుని..తమ అద్భుతమైన ప్రదర్శనలతో సంతోష పరుస్తున్నారు. ఇలా క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ప్లేయర్.. ఆ దేశ ప్రజల కోసం కసిగా ఆడుతుంటారు.

అందుకే అనేక సార్లు పెద్ద పెద్ద దేశాలపై కూడా ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. అంతేకాక ఇటీవల ప్రారంభమైన టీ20 వర్డల్ కప్ లో మంచి ప్రదర్శన ఇచ్చి..తమ ప్రజల కళ్లలతో సంతోషం చూడాలని భావించారు. అందుకే అమెరికాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఎలా అంటే.. ఎప్పుడు సెమిస్ గడప తొక్కని ఆ దేశం.. ఈసారి.. అడుగు పెట్టింది. న్యూజిలాండ్ , ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్లను సైతం ఓడించింది. చివరకు మంగళవారం బంగ్లాదేశ్ తో చావోరేవో మ్యాచ్ లో పట్టుదలతో శ్రమించి విజయం సాధించింది. దీంతో సగర్వంగా ఆఫ్ఘనిస్తాన్ సెమిఫైనల్ లోకి అడుగు పెట్టింది. దీంతో ఆ దేశంలో సంబరాలు మిన్నంటాయి. ఎప్పుడు వరకు కర్ఫూ వాతావరణం కనిపించే ఆఫ్ఘనిస్తాన్ లో తాజాగా ఆ దేశం టీ20 వరల్డ్ కప్ లో సెమిఫైనల్ కి చేరడంతో పండగ వాతావరణం కనిపిస్తుంది. అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటారు. నిర్మానుష్యంగా ఉండే వీధులు జనాలతో నిండిపోయింది. ఇలా జీవితంపై ఆశలు లేని,వారికి క్రికెట్ ఒక్కటే సంతోషాన్ని ఇచ్చేది. ఇప్పుడే ఆ క్రికెటే..వారిని వీధుల్లో సంబరాలు చేసుకునేందుకు కారణమైంది. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ కూడా తమ దేశ పౌరుల కళ్లలో సంతోషం చూసేందుకే..ప్రతి మ్యాచ్ ను కసితో ఆడారు. దాని ఫలితమే.. తాజాగా ఆ టీమ్ సెమి ఫైనల్ కి ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా ఆట కొందరి జీవితాల్లో మార్పు తెస్తుంది, సంతోషాన్ని ఇస్తుందని అనడానకి సరైన ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల జీవితమే. ప్రస్తుతం ఆ దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. కర్ఫ్యూల మధ్య బతికే వారి జీవితాల్లో వరల్డ్ కప్ వెలుగులు తెచ్చిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి.. వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

శ్రీ రామ నవమి రోజున రాముల వారి సాక్షిగా ఓ బీసీ బిడ్డకు అవమానం
IMG-20250408-WA0434
పరామర్శించిన కేటీఆర్ సేన అధ్యక్షుడు
Oplus_131072
ఏసీబీ వలలో చింతలపాలెం ఎస్సై
కాటమయ్య రక్షణ కవచం అందరూ వినియోగించా కల్లుగీత కార్మిక
IMG-20250405-WA0368
ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి