పిఠాపురం, జూలై 20 : పిఠాపురం నియోజవర్గం మల్లాం గ్రామ వాస్తవ్యురాలు అయినటువంటి డాక్టర్ బుర్రా దివ్య రాజ్ (అంతర్జాతీయ విద్యా వేత్త) గడిచిన ఎలక్షన్స్ లో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గెలుపుకు ఎంతగానో కృషి చేసి తమ విలువైన సమయాన్ని కేటాయించి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపు కీలక పాత్ర పోషించారు. శుక్రవారం దివ్య రాజ్ జన్మదిన దినోత్సవం సందర్భంగా పిఠాపురం మండలం మల్లాం గ్రామం నుంచి జనసేన నాయకులు బుర్రా విజయ్ మరియు నాయకులు జనసైనికులు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలానే కరోనా సమయంలో కరోనాను సైతం లెక్కచేయకుండా మందులు పంపిణీ కార్యక్రమం, అలానే కొన్ని గ్రామాల్లో ఎవరికైతే లోటుపాట్లు ఉన్నాయో వాళ్లందరికీ నేను ఉన్నాను అన్న భరోసా ఇచ్చి… తనలో ఉన్న మంచి తనాన్ని చాటుకున్న వ్యక్తి బుర్రా దివ్య రాజ్ అని గుర్తుతెచ్చుకొని అభినందించారు.