HM9NEWS అదిలాబాద్ జిల్లా: పుష్ప సినిమాలో పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం తరలించే సీన్ మీకు గుర్తుందా? అచ్చం అలాంటి ప్లాన్‌నే గంజాయి స్మగ్లర్లూ అమలు చేశారు. కాకపోతే పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఈ సంఘటన పుష్ప సినిమాలోని ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్‌ను గుర్తు చేసింది. కుమురం భీం జిల్లా వాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద గురువారం సాయంత్రం పోలీసుల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న ట్యాంకర్ లారీలో డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించిందని తెలిపారు. దీంతో చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని ఆపి తనిఖీలు చేపట్టామని వివరించారు.