Search
Close this search box.

వైసిపి పాలనలో బూ ఆక్రమణలు..కబ్జాలు

అటవీ, దేవాదాయ భూములను మింగిన నేతలు

శ్వేతపత్రంతో నిజాలను వెల్లడిరచిన బాబు

బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ 

వైసీపీ పాలనలో భూ ఆక్రమణలు ,కబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం వాస్తవాలను తెలియజేసిందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ అన్నారు. వైసీపీ నాయకులు మూడు రాజధానులని మభ్య పెట్టి మూడు ప్రాంతాలలో అన్ని రకాల భూముల దోపిడీ చేశారని ఆరోపించారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రభుత్వ, అటవీ, దేవాలయ మరియు ప్రజల స్వార్జిత భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ… భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. నీతి అయోగ్‌ డ్రాప్ట్‌ సూచనలను పక్కదోవ పట్టిస్తూ జగన్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తేవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారన్నారు. ప్రజల, ప్రభుత్వ భూముల రక్షణ కోసం ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం తెస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనను ఆహ్వానిస్తున్నాన్నారు. వైసీపీ పాలనలో లక్షల ఎకరాల పేదల డీకే భూముల దోపిడీకి తెరలేపారని.. దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. చుక్కల భూములు 22ఏ క్రింద చూపుతూ వాస్తవ యాజమాన్య హక్కులున్న రైతులకు, ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమస్య పరిష్కారం సత్వరం అవసరమన్నారు. చుక్కల భూముల సమస్య ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు చాల ఎక్కువ ఉందని తెలిపారు. గత అయిదు సంవత్సరాలలో రాష్ట్రంలో వేలది ఎకరాలకుపైగా దేవాలయాల భూముల రికార్డులు తారుమారు చేశారని చెప్పారు. సింహాచలం దేవాలయ భూములను అన్యాక్రాంతం చేశారన్నారు. సింహాచలం దేవాలయ గెస్ట్‌ హౌస్‌లో తమిళనాడు నుంచి వచ్చిన కార్తీక్‌ సుందర రాజన్‌ అనే వ్యక్తి దేవాలయల భూముల రికార్డులను 

తారుమారు చేసిన ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అన్నవరం, ఇంద్రకీలాద్రి దేవాలయాల భూముల అక్రమణ, కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని ఉన్నాయన్నారు. తిరుపతిలోని హాదిరాం మఠం భూములు గందరగోళం అయ్యాయని బీజేపీ నేత వెల్లడిరచారు. రాష్ట్రంలో ప్రతి దేవాలయం భూముల రికార్డులను పరిశీలించి కబ్జాలకు గురైన, అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తేవాల్సి ఉందన్నారు. పేదలకు ఇండ్ల పట్టాలని రాజమండ్రి ఆవ భూములు, కాకినాడ మడ అడవుల అక్రమాలు మాదిరిగానే రాష్ట్రం మొత్తం జరిగిన వైసీపీ అవినీతి చిట్టా బయట పెట్టి దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నాడు వైసీపీ ప్రజాప్రతినిధులు బెదిరింపులతో విశాఖపట్నంలో భూముల డెవలప్మెంట్‌ అగ్రిమెంట్లపైన తీవ్రమైన 

ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. కోస్తాలో ఒంగోలులో దొంగ రిజిస్టేష్రన్‌ డాక్యుమెంట్లు, విజయవాడ, గుంటూరులో పైవేట్‌ ఆస్తులు కబ్జాలు, నెల్లూరులో క్వాట్జ్‌, సిల్లికా సంపదను దోచేశారని తెలిపారు. రాయలసీమలో ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు అస్మదీయులకు జగన్‌ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అయిదు సంవత్సరాలుగా ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్‌ క్వారీలను చిన్నాభిన్నం చేశారన్నారు. జగన్‌ స్వంత జిల్లా కడపలో లో బెరైటీస్‌, సున్నపు రాయి త్రవ్వకాల అక్రమాలు ఆకాశాన్ని తాకాయన్నారు. సహజ వనరులతో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని పక్కన పెట్టి అనుయాయులకు సర్వ సంతర్పణ చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ ఆఫీసుల కోసమని జిల్లాకొక ప్యాలెస్‌ నిర్మాణం కోసం అక్రమ భూ కేటాయింపులు చేసి దేశంలో రాజకీయ పార్టీ ఆఫీసుల నిర్మాణంలో అవినీతి రికార్డు సృష్టించిన జగన్‌.. వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టుకోవడం తప్పు కాదు, ప్రభుత్వ భూములను కేటాయించిన తీరు చూస్తే రాచరిక విధానం ప్రతిబింబిస్తుందని లంకా దినకర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి