నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీకులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. యూజీసీ-నెట్ పేపర్ లీక్ కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల్ని రద్దు చేసింది. ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. అయితే ఈ కేసు దర్యాప్తు కోసం వెళ్లిన సీబీఐ అధికారులపై దాడి జరిగింది. బీహార్‌లోని నవడా జల్లాలో ఉన్న కసియాదిహ్ గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అయితే, నకిలీ అధికారులని భావించి గ్రామస్తులు దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దాదాపుగా 200 మందిపై కేసులు నమోదు చేశారు.