తొలి విడత సీట్ల కేటాయింపు
ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలి విడత సీట్ల కేటాయింపు పక్రియను అధికారులు పూర్తి చేశారు. ఇటీవల తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహించిన అధికారులు బుధవారం మొదటి రౌండ్ సీట్ల కేటాయింపునకు సంబంధించిన వివరాలను వెల్లడిరచారు. ఈ మేరకు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అలాట్‌మెంట్ ఆర్డర్‌ను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకొనేందుకు హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం.. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు 17`22లోపు చేరాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.