Search
Close this search box.

నేటినుంచి జనసేన ఆర్జీల స్వీకరణ

అందుబాటులో ఉండాలని పార్టీ నేతలకు పవన్‌ ఆదేశాలు

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేటినుంచి అర్జీలు స్వీకరణ కార్యక్రమం దృష్ట్యా ఆ పార్టీ చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆగస్టు 1 నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు, సూచనలు స్వీకరించాలని ఆదేశాలిచ్చారు. పార్టీ ఎంపీలు, ఎమ్మల్యేలు ప్రతి నెలా కనీసం రెండు రోజులపాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

ప్రజలు చెప్పే సమస్యలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించాలని సలహా ఇచ్చారు. ఈ మేరకు ఆగష్టు 1 నుంచి సెప్టెంబరు 11 వరకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేల వివరాలను జనసేన పార్టీ ప్రకటించింది. మంగళవారం తనతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించిన హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెనిఫర్‌ లార్సన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధప్రదేశ్‌ అభ్యున్నతిపై కేంద్రీకృతమై ఇటువంటి నిర్మాణాత్మక చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ‘విూ భాగస్వామ్యంతో యువతలో ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో చాలా కీలకమైనది. ఆంధప్రదేశ్‌ అంతటా స్థిరమైన అభివృద్ధిని పెంపొందించేందుకు విూరు సహకారం ఇస్తారని ఆశిస్తున్నాను‘ అంటూ పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.కాగా మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో అయిన యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిపర్‌ లార్స్‌ న్‌ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్ళేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని వారిని పవన్‌ కళ్యాణ్‌ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250405-WA0368
ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు
గావిచర్ల గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఒకరు మృతి
గావిచర్ల గుండ బ్రహ్మయ్య జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 
పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళా సంఘాల సభ్యులు.

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి