పదేళ్లలో 40 వేల కి.విూ. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశాం
పదేళ్లలో జరిగిన అభివృద్ది కేవలం ట్రైలర్ మాత్రమే
ఆత్మవిశ్వాసంతో దేశం ముందుకు నడుస్తోంది
మాస్కోలో ఎన్నారైల సదస్సులో ప్రధాని మోడీ
మాస్కో,జూలై9(ఇది నిజం): రాబోయే ఐదేళ్ల పదవీకాలంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లలో భారత్ ఎంతగానో పురోభివృద్ది సాధించిందని అననారు. ఇటీవలే మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశానని, మూడు రెట్ల వేగంతో పని చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. మంగళవారం రష్యా రాజధాని మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక్కడికి తాను ఒక్కడినే రాలేదని, 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను వెంట తీసుకొని వచ్చానని వ్యాఖ్యానించారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధి జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నారు దేశం మారుతోందని ప్రపంచమంతా గర్విస్తోందన్నారు.విదేశాల్లో ఉంటున్న భారతీయులు దేశాన్ని చూసి గర్విస్తున్నారని చెప్పారు. మహిళలను లక్షాధికారులను చేస్తున్నామన్నారు. భారత్‌లో పేదల కోసం 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. భారత్ జీ20 సదస్సును సమర్థవంతంగా నిర్వహించిందన్నారు. కోవిడ్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. భారత్ ను ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సురెన్స్ స్కీంను అమలు చేస్తున్నామని తెలిపారు. 2024కు ముందు దేశం నిరాశతో ఉండేది.. ఇపుడు ఆత్మవిశ్వాసంతో నిండి ఉందన్నారు.
డిజిటల్ పేమెంట్స్ తో కొత్త రికార్డులు సృష్టిస్తున్నామని చెప్పారు మోదీ. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో రైల్వే బ్రిడ్జి నిర్మించామని.. పదేళ్లలో 40 వేల కి.విూ. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశామని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించామని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో140 కోట్ల మంది భారతీయుల పాత్ర ఉందన్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచి దేశం సంబురాలు చేసుకుంది.. చివరి వరకు టీమిండియా
పోరాడిరది. ఒటమి ఒప్పుకోని వారినే విజయం వరిస్తుందన్నారు. భారత్ రష్యా మద్య సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయన్నారు. 10 సంవత్సరాలలో సెవిూకండక్టర్ల నుంచి ఎలక్టాన్రిక్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల వరకు మరింత వేగంగా అభివృద్ధి చెందబోతున్నామని చెప్పారు. సవాళ్లను స్వీకరంచడంలో భారత్ ముందంజలో ఉంటుందన్నారు. ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రయాన్ ప్రయోగం చేశాం. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా గుర్తింపు పొందాం. డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఉన్నాం. స్టార్టప్‌ల్లో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకున్నాం. 2014లో వందల్లో ఉన్న స్టార్టప్‌లు నేడు లక్షల్లోకి చేరాయి. భారత్ రికార్డు స్థాయిలో పేటెంట్లను సాధిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్యబీమా వ్యవస్థ భారత్‌లో ఉంది. భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థికవ్యవస్థగా నిలబెడతాను. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్ఠమైంది అని వివిధ రంగాల్లో భారత్ సాధిస్తోన్న విజయాలను ప్రస్తావించారు. భారత్ ఘనతను ప్రపంచం గుర్తించకతప్పని పరిస్థితి తెచ్చామని వ్యాఖ్యానించారు. భారత యువతే దేశ నిజమైన ఆస్తి అని, ఆత్మవిశ్వాసం దేశానికి అతిపెద్ద ఆయుధమని అన్నారు. ఉక్రెయిన్`రష్యా యుద్ధం వేళ.. భారత విద్యార్థులు చిక్కుకుపోతే, వారిని కాపాడటంలో పుతిన్ సహకరించారని మోదీ గుర్తుచేశారు. ఈసందర్భంగా ఆయనతో పాటు రష్యా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్`రష్యా నమ్మకమైన మిత్రులు. పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా ఈ స్నేహం కొనసాగుతోంది. రష్యాలో చలికాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ల్లోకి పడిపోయినా, మన బంధం మాత్రం ఎప్పుడూ ప్లస్‌లోనే ఉంటుంది. మన స్నేహాన్ని ఆహ్లాదంగా ఉంచుతుంది. ఇప్పటివరకు నేను ఆరుసార్లు రష్యాలో పర్యటించాను. పుతిన్‌తో 17 సార్లు భేటీ అయ్యాను అని తెలిపారు. ఇకపోతే మోదీ, పుతిన్ 22వ భారత్`రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు, వాణిజ్యం, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరపనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం రష్యాకి చేరుకున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ప్రధాని విమానం ల్యాండ్ కాగానే అక్కడి అధికారులు మోదీకి రెడ్ కార్పెట్ వేసి సాదర స్వాగతం తెలిపారు. దాండియా, గర్భా నృత్యాలతో రష్యా అధికారులు ఆయనకు వెల్‌కం చెప్పారు. ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య పలు ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుండి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు జెలెన్స్‌కీ నుండి నాటో వరకు ప్రతి ఒక్కరూ ఈ సమావేశంపై దృష్టి పెట్టారు. 2025 నాటికి భారత్, రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. రష్యా 2025 నాటికి 50 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య పలు అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. వాటిలో ప్రధానంగా ్గªటైర్ జెట్ ªూఙ`57పై ఒప్పందం. భారతదేశంలో యాంటీ ట్యాంక్ షెల్స్‌ను తయారీ పరిశ్రమకు సంబంధించి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. మ్యాంగో ఆర్మర్`పియర్సింగ్ ట్యాంక్ రౌండ్ ఫ్యాక్టరీ డీల్, సైనిక లాజిస్టిక్స్ ఒప్పందంపై చర్చ, ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ప్రాధాన్యత, ఉక్రెయిన్`రష్యా యుద్ధంపై చర్చ, రక్షణ, చమురు, గ్యాస్‌కు సంబంధించిన అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు.