Search
Close this search box.

పార్లమెంటు ప్రతి పక్షనేతకు భారీ భద్రత

పార్లమెంట్ లో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపు తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రసంగంపై ఇప్పటికే పలువురు అభ్యంతరం చేశారు. 

ఈ క్రమంలోనే హిందూ సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పై దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసు నిఘా వర్గాలనుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో హోంమంత్రి త్వశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ, ఆయన ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాహుల్ నివాసం దగ్గర అదనంగా బలగాల ను మోహరించారు. 

అదే ప్రాంతంలో నివసిస్తున్న కాంగ్రెస్ నేతలపై కూడా నిఘా పెట్టారు. కాంగ్రెస్ అగ్రనేత లోకసభలో అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ పై పలువురు సంస్థల నాయకులు దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులకు బుధవారం అర్థరాత్రి సమాచారం అందింది. 

రాహుల్ కు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వెలిసే ఛాన్స్ ఉందని తెలిపింది. దీంతో రాహుల్ ఇంటి వద్ద అదనంగా రెండు ప్లాటూన్ల బలగాలను మోహరించారు. ఒక్కో ప్లాటూన్ లో 16 నుం చి 18 మంది పోలీసులు ఉంటారు. అంతేకాదు తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో 8 నుంచి 20 మంది అదనపు పోలీసు లను మోహరించారు. 

న్యూఢిల్లీ సరిహద్దులను మూసివేసి క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ ను కూడా పెంచారు. న్యూఢిల్లీ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేష్ మహాలా సోమవారం రాత్రి జిల్లాల్లోని అన్ని ఏసీపీలు, పోలీస్ స్టేషన్ ఇంచార్జీలకు భద్రతను పెంచాలని ఆదేశించారు. 

హిందూ సంస్థలపై నిఘా పెట్టడమే కాదు..భవిష్యత్ వ్యూహాలను ఆరా తీయాల ని ఆదేశించినట్లు సమాచా రం. రాహుల్ గాంధీ నివాసం దగ్గర , ఇతర ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు వేయ కుండా చూడాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి