Search
Close this search box.

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం

 Hm9 న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా  కలెక్టర్ కోయ శ్రీహర్ష తన వ్యక్తిగత జీవితంలో చూపిన నిబద్ధత, సామాజిక బాధ్యతను మరోసారి నిరూపించారు. ఆయన భార్య విజయ గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో సజీవంగా ప్రసవించారని అధికారులు తెలిపారు. నిన్న రాత్రి పురిటినొప్పులు రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అప్రమత్తంగా స్పందించి సీజేరియన్ ఆపరేషన్ ద్వారా విజయను ప్రసవించించారు. ఆమె ఒక ఆరోగ్యమైన మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రత్యేక విషయం ఏంటంటే, విజయ గర్భం దాల్చిన దశ నుంచే కలెక్టర్ శ్రీహర్ష ఆమెకు ప్రభుత్వాస్పత్రిలోనే వైద్య సేవలు అందించారు. వ్యక్తిగతంగా అత్యున్నత స్థాయి సేవలు పొందే అవకాశమున్నప్పటికీ, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ వైద్య వ్యవస్థపై విశ్వాసం చూపించారు.ఈ ఘటన జిల్లా ప్రజల్లోను, ఇతర అధికారుల్లోను కూడా గొప్ప ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంపొందించాల్సిన అవసరాన్ని కలెక్టర్ తమ ప్రవర్తన ద్వారా చాటిచెప్పారు. వైద్యసిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన వారు అనేకం. ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యతపై ప్రజల నమ్మకం మరింత బలపడేలా ఈ సంఘటన ప్రభావం చూపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ కు రివార్డు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ వేములవాడలోనీ కొవ్వొత్తుల నివాళి అర్పించారు
ఇంటర్ ఫలితాలు విడుదల
కిటకిటలాడిన కొమురవెల్లి