Hm9 న్యూస్ ప్రతినిధి రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల శనివారం నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ అమాయకులపై దాడులు జరపడం చాలా బాధాకరమన్నారు. కాశ్మీర్ లోని ఉగ్రదాడిలో మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నామన్నారు. దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. ఈ దాడి చేసిన ఉగ్రవాదులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కేంద్రం ఎటువంటి సంకోచం లేకుండా కఠినంగా వ్యవహరించాలనీ కోరుతు,మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.. వారి వెంట సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, పట్టణ మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, గోలీ మహేష్, నరాల శేఖర్, జోగిని శంకర్, రూరల్ మండల అధ్యక్షుడు గోసుకుల రవి, తదితరులు పాల్గొన్నారు