
Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో,ఇటీవల గుండెపోటుతో హఠాత్తుగా సంగెం గ్రామానికి చెందిన గట్ల రమేష్ అకాస్మికంగా మరణించడంతో ఆ పేద కుటుంబానికి నిలువ నీడ లేదు ఆ పేద కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉందని తెలుసుకుని వాట్సాప్ గ్రూప్ ద్వారా పులి రాజశేఖర్, మరియు తన స్నేహితుడు గునిగంటి శ్రీనివాస్ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్థిక సహాయం చేయాలని విన్నవించుకోక గ్రామాల్లో,స్నేహితులు దాతల సహకారంతో విరాళాలు సేకరించి అందిరు పేద కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆర్థిక సహాయం 81000/రూ సేకరించి మృతుడు భార్య అనిత వారి ఇద్దరి కూతుర్ల చేతిలో మొత్తం డబ్బులు ఇచ్చారు. పులి, రాజశేఖర్, తన స్నేహితుడు గునుగంటి శ్రీనివాస్ ను గ్రామంలో ఉన్న ప్రజలు, వారి స్నేహితులు వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో పులి రాజశేఖర్, గునుగంటి శ్రీనివాస్, మునుగుంట్ల శ్రీనివాస్, పులి వీరస్వామి, కోడూరు సదయ్య, ఆగపాటి రాజు, గుండేటి కుమార్ స్వామి, రమేష్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు