Search
Close this search box.

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు

HM9 న్యూస్ ప్రతినిథి వరంగల్ జిల్లా:  సంగెం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జరిగిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం -2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద మరియు అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు కోలాటాలు, డప్పు చప్పులతో కలసి భూభారతి చట్టం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించి ప్రారంభించారు.ఈసందర్భంగా సదస్సుకు హాజరైన రైతులకు భూ భారతి చట్టం  విది విధానాలు వివరించారు.రైతులు, ప్ర‌జ‌లు లేవ‌నెత్తే సందేహాల‌కు వారికి అర్ధ‌మ‌య్యేలా జిల్లా కలెక్టర్  సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న భూ భారతి చట్టం, భూముల సమస్యలను పరిష్కారానికి ఒక మంచి అవకాశమని,భూ సంబంధిత వివాదాలు త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.భూ భార‌తి చ‌ట్టాన్ని క్షేత్ర స్థాయికి స‌మర్థంగా తీసుకెళ్లేందుకు ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.భూభార‌తి చ‌ట్టంలో రెవెన్యూ యంత్రాంగమే ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. ఎంతో మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భారతి చట్టం తేవడం జరిగింది.రాష్ట్రంలో తొలి విడతగా 4 మండలాల్లో అమలు చేస్తున్నామని,ధరణి కంటే ముందు ఉన్న స్టేటస్ భూభారతి పోర్టల్ లో ఉండబోతున్నాయి అన్నారు.భూభారతి చట్టం దేశానికి ఆదర్శం కాబోతుందని అని,ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ అధికారిని త్వరలో నియమిస్తామని తెలిపారు. రైతు భూముల సమస్యలకు త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనలతో ధరణి పోర్టల్ అమలు చేసి రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. ధరణి పోర్టల్ లో ఏ ఒక్క నిర్దిష్టమైన సమస్య పరిష్కరించలేదన్నారు.మధ్య దళారులు రైతులను దోపిడీ చేశారన్నారు. భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి పరకాల నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ సంపూర్ణమైన సమస్యల పరిష్కారానికి సవరణలు సూచనలు అమలు చేస్తామని తీర్మానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి