Hm9 న్యూస్ ప్రతినిధి హన్మకొండ జిల్లా పరకాల కామారెడ్డిపల్లీ కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మోకులు తీసుకున్న ప్రతిగీతా కార్మికుడు ఉపయోగించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ ఆముదాలపల్లి మల్లేశం గౌడ్ కోరారు. మంగళవారం పరకాల మండలం కామారెడ్డి పల్లి గ్రామంలో బీసీ వెల్ఫేర్, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై పరకాల నియోజకవర్గ గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మొకుల కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ గీతా కార్మికులకు ప్రభుత్వం సరైన బడ్జెట్ కేటాయించాలని, గీతా వృత్తి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారులు డిడి డైరెక్టర్ రామ్ రెడ్డి, రవి కుమార్, అందే రవి, రజిని కాంత్, భానుచందర్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు మోడెం రాజేందర్ గౌడ్, గట్టు శ్రీధర్ గౌడ్, కారంగుల రవి గౌడ్, ట్రైనర్లు గునిగంటి బుచ్చి రాములు, తడక వేణు, కామారెడ్డి పల్లె గ్రామ సొసైటీ అధ్యక్షులు చిర్ర సాంబయ్య గౌడ్, మాజీ సర్పంచ్, చిర్ర భద్రయ్య గౌడ్ వివిధ గ్రామాల గీతా కార్మికులు పాల్గొన్నారు.