HM9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో పద్మశాలి భవన్ లో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఆధారిత సంఘాల నాయకులకు లింగాధారిత హింస నివారణ, పరిష్కారా లపై శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మాజీ ఎంపీపీ కందకట్ల కళావతి పాల్గొని మాట్లాడారు. సామాజిక చైతన్యం లో ముఖ్య పాత్ర వహిస్తూ, గ్రామం లోని సమస్య లను పరిష్కరిస్తూ, అభివృద్ధి కి సహకరిస్తున్నారని,మహిళా సమస్య లను,కుటుంబ సమస్య లను కూడా గుర్తించి నివారించాలని అన్నారు.మహిళలు కుటుంబ అభివృద్ధి లోనే కాకుండా సమాజం లో కూడా గౌరవస్థితి లో ఉన్నారని అన్నారు. అలాగే మహిళ పైన, ఆడపిల్లలు పైన జరుగుతున్న దాడులు, హింస ను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని, ప్రశ్నిచాలని, ప్రతిఘటించాలని అన్నారు. గ్రామాలలో కుటుంబ హింస కు కారణాలను, సహకరించే వ్యవస్థ లను అందరికి తెలియజేయాలని అన్నారు. సంస్థ సమస్య లలో ఉన్న మహిళ లకు వృత్తి నైపుణ్య కార్యక్రమాలు, అవసరం అయినా కుటుంబాలకు కౌన్సిలింగ్, హక్కులు కల్పించడానికి న్యాయ సహాయం, అందిస్తున్నారని అన్నారు.ట్రైనింగ్ కో ఆర్డినేటర్ ఇందిర మాట్లాడుతూ మహిళా సమస్య లపై అందరు మాట్లాడాలని, పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మహిళలకు సహకరం అందించి ,రక్షణ కల్పించే వ్యవస్థ ల సమన్వయం తో సమస్యలతో,హింస కు గురైన మహిళ లకు గ్రామస్థాయి మహిళా సహాయత కమిటీలు అండగా నిలబడాలని కోరారు.ఈకార్యక్రమం లో సంగెం మండలం కమ్యూనిటీ లీడర్స్, సంస్థ క్లస్టర్ కో ఆర్డినేటర్ వనిత పాల్గొన్నారు.