HM9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా : సంగెం మండల కేంద్రంలో రామ శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళిర్పించిన పద్మశాలి కుటుంబ సభ్యులు పద్మశాలి సమాజానికె కాదు యావత్ తెలంగాణకే తీరని నష్టం..పద్మశాలి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కండగట్ల నరహరిప ద్మశాలీల ఐక్యతకు,అభ్యున్నతికి ఎనలేని సేవ చేశారని,భారత దేశ చరిత్రలోనే పద్మశాలి సంఘంను తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వపరంగా సంఘంను రిజిస్ట్రేషన్ చేసిన ఘనత రామ శ్రీనివాసుకే దక్కుతుందని పద్మశాలి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కందగట్ల నరహరి అన్నారు.గురువారం రోజున సంగెం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో రామ శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధికార ప్రతినిధి కందగట్ల నరహరి మాట్లాడుతూ..రామ శ్రీనివాస్ మోక్షారామా ఫౌండేషన్ పేరుతో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారని,అమ్మ ఒడి పేరుతో అనాథలు,వృద్ధులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని మరియు వరల్డ్ పద్మశాలి సంఘం వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వ్యవస్థాపకులు రామ శ్రీనివాస్ అని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.నిత్యం పద్మశాలి సమాజ శ్రేయస్సు కోసం తపించే వారు అని,శ్రీనివాస్ మరణం పద్మశాలి సమాజానికె కాదు యావత్ తెలంగాణ కి తీరని నష్టమని అన్నారు. e కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొంతం వేణు, కార్యవర్గ సభ్యులు బూర ప్రకాష్, బిట్ల రామకృష్ణ,కందగట్ల సంపత్,బిట్ల తిరుపతి,కందగట్ల వెంకటేశ్వర్లు, పేరాల లక్ష్మీనర్సయ్య,బిట్ల వేణు, ఇప్పకాయల రాజనరేంద్రపులిపాటి మధు సుధాన్ ,కటకం భిక్షపతి,అందె కృష్ణ మూర్తి, బిట్ల ఉప్పలయ్య,ఇప్పకాయల లక్ష్మీనారాయణ,భిక్షపతి, బిట్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.