HM9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: సమ్మె లో ఉన్న సమగ్ర శిక్షణ ఉద్యోగుల సిబ్బంది ఆర్థికేతర అంశాల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించి న్యాయం చేస్తాము.ప్రజా భవన్ లో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎం ఎల్ సి ప్రొఫెసర్ కోదండ రామ్టీ జిఓ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్ తో కలిసిన ప్రతినిధి బృందం. డిమాండ్ల పై సాధ్యమైనంత త్వరలో సమస్యకు ఒక సానుకూలమైన రీతిలో స్పందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.సమ్మె కాలంలో వేతనం కూడా ఇవ్వడానికి సిద్ధం సమగ్ర శిక్షా ఉద్యోగులు నెల రోజులుగా నిరసన చేస్తున్న విషయం విదితమే..సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు