Hm9news ప్రతినిథి హన్మకొండ జిల్లా: పరకాల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు రూ ఐదు కోట్ల రూపాయలతో నూతన ప్రభుత్వాన్ని డిగ్రీ కళాశాల పనులకు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.పరకాలను ఎడ్యుకేషనల్ హబ్ గా డెవలప్ చేస్తానని అన్నారు.ఇప్పటికే నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూర అయిందని, ఇండోర్ స్టేడియం, నూతన లైబ్రరీ ఏర్పాటు చేస్తానన్నారు.విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని,అలాగే ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూల్ లకు 40 శాతం డైట్ మరియు కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని అన్నారు.అన్ని కులాల పేద విద్యార్థులకు మెరుగైన వైద్య కల్పనే లక్ష్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కలిగిస్తుందన్నారు.పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని,వచ్చే అకాడమిక్ ఇయర్ లో ప్రారంభం చేయుటకు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.