Search
Close this search box.

మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు

Hm9న్యూస్ ప్రతినిథి :  హైదరాబాద్:  కౌశిక్‌ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరిం చారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే హరీష్‌ రావు వెళ్లారు. ఇవాళ ఉదయం కౌశిక్‌ ఇంటి వద్దకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్‌ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అనుమతి లేదంటూ హరీష్‌ రావు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసు కుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈనేపథ్యంలో పోలీసులు హరీష్‌ రావును అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి హరీష్‌ రావును గచ్చిబౌలి పోలీస్టే షన్‌ కు తరలించారు. దీంతో కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది నిన్న కౌశిక్‌ రెడ్డి పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐను అడ్డగించి, బెదిరించారని కౌశిక్‌ రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కౌశిక్‌ రెడ్డి సహా మరో 20 మందిపై కేసు నమోదు చేశారు. ఈనేపథ్యంలో ఇవాళ బంజారాహిల్స్‌ లోని కౌశిక్ రెడ్డి,ఇంటికి హరీస్ రావు రానున్నట్లు సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చిన హరీష్‌ రావును పోలీసులు అడ్డుకున్నారు. అ నుమతి లేదంటూ చెప్పడంతో హరీష్‌ రావు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కౌశిక్‌ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత, తోపులాట జరగడంతో పోలీసులు హరీష్‌ రావును అదుపులో తీసున్నారు. దీంతో హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నా రని ప్రశ్నించినా పోలీసులు హరీష్‌ రావును అదుపులో తీసుకుని గచ్చిబౌలి పోలీస్టేషన్‌ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి
Screenshot_20250430-141720
బిచ్కుంద లొ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన జూక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు
మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ కు రివార్డు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ వేములవాడలోనీ కొవ్వొత్తుల నివాళి అర్పించారు