Hm9news ప్రతినిధి వరంగల్ జిల్లా: గీసుగొండ మండలం ఊకల్ గ్రామ పరిధిలోని ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఈజీఎస్ నిధులతో మంజూరైన ఫారం పాండ్ పనులకు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.అనంతరము ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనులు పూర్తి చేసిన కూలీలకు సన్మానం చేశారు.ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ లలో కొలతల ప్రకారం పని వివరాలను పక్కాగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు.కూలి డబ్బులు సక్రమంగా బ్యాంకు ఖాతాలో పడుతున్నాయా అడిగి తెలుసుకున్నారు.జాబ్ కార్డున్న ప్రతి కూలీ ఉపాధిహామీ పథకాన్ని సద్వినియొగం చేసుకోవాలని కోరారు.