Search
Close this search box.

జిల్లా కలెక్టర్ ని కలిసిన జిల్లా టీ ఎస్ జే యు కమిటీ

HM9NEWS ప్రతినిధి ములుగు జిల్లా: తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ యు జే ఐ) ములుగు జిల్లా కమిటీ నాయకులు సోమవారం జిల్లా కలెక్టరెట్ కార్యాలయంలో కలెక్టర్ దివాకర టిఎస్. ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి శాలువాతో సత్కరించి, టీ ఎస్ జే యు రాష్ట్ర కమిటీ నియమించిన ములుగు జిల్లా కమిటీ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నికైన ములుగు జిల్లా కమిటీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని, వాస్తవిక వార్తలను వెలికితీయాలని,జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలను అందిస్తానని ఆయన అన్నారు. అనంతరం ములుగు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సిహెచ్ మహేందర్ జి, డిపిఆర్ఓ రఫిక్ లను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. డి పి ఆర్ వో కు ములుగు జిల్లా కమిటీ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన జిల్లా కమిటినీ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. డిపిఆర్ఓ కార్యాలయం నుంచి విలేకరులకు పూర్తి సమాచారము, సంబంధిత సేవలను ఎల్లవేళలా అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ జేయు ములుగు జిల్లా గౌరవాధ్యక్షుడు పడమటింటి నగేష్, అధ్యక్షుడు చల్లగురుగుల రాజు, ప్రధాన కార్యదర్శి సంగ రంజిత్ కుమార్,ఉపాధ్యక్షుడు కూనూరు మహేందర్, జాయింట్ సెక్రెటరీ తడక హరీష్, కోశాధికారి పొన్నాల స్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచర్ల రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కవ్వంపల్లి అనిల్ కుమార్ తదితర జర్నలిస్టు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
IMG_20250102_192042
సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భేటీ
పునుగు పిల్లులను పట్టుకున్న హనుమకొండ ఫారెస్ట్ అధికారులు 
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలి
IMG_20241230_183120
జర్నలిస్టుల రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి