HM9NEWS ప్రతినిథి కామారెడ్డి జిల్లా: కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి.బిబిపేట్ దోమకొండ. మాచారెడ్డి. భిక్నూర్ మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలను సందర్శించిన నుతనంగా ఎన్నికైన జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డిఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ మాట్లాడుతూ నూతన గ్రంథాలయ భవనాలకు ఆధునికరించడానికి ప్రభుత్వంతో త్వరలో నిధులు మంజూరు చేయిస్తామన్నారు ప్రతి గ్రంథాలయంలో అవసరమైన మేరకు స్టడీ మెటీరియల్స్ అందించే ప్రయత్నం చేస్తామన్నారు చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు వారి ద్వారా గ్రంధాలయాలకు ఎలాంటి లోటు రాకుండా చూస్తానని అన్నారు ఈ సందర్భంగా జిల్లా యూత్ అధ్యక్షులు మొహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ తన సొంత నిధులతో కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రంథాలయానికి ఇంటర్నెట్ కలెక్షన్ తో పాటు వైఫై ని ఏర్పాటు చేస్తానన్నారు ప్రతి గ్రంధాలయానికి తన వంతు విరాళంగా పదివేల రూపాయల చొప్పున అందించారు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు, సాహితీ వేత్తలకు గ్రంధాలయాలు అన్ని విధాలుగా ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ, రిటైర్డ్ ఉద్యోగులు, రచయితలు, మేధావులు గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.ప్రతి గ్రంథాలయంలో మరుగుదొడ్లు మరియు తాత్కాలిక మౌలిక వసతులు వెంటనే షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా సమకూర్చుతామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం యువత భవిష్యత్తు కోసం స్కిల్ యూనివర్సిటీలు స్పోర్ట్స్ యూనివర్సిటీలు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఏర్పాటు చేస్తుందన్నారు రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాలోనీ అన్ని గ్రంథాలయాలను రోల్ మోడల్ గా తీర్చిదిద్ది నిరుద్యోగ యువతకు అవసరమయ్యే అన్ని స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తామన్నారు