హన్మకొండ:
తెలంగాణ చాప్టర్ ఆఫ్ అబస్టేట్రిక్స్ మరియు గైనకాలజీ 7వ వార్షికరాష్ట్ర సదస్సులో పాల్గొన్న ఎంపీ డా. కడియం కావ్య గారు…..
వరంగల్ వేదికగా మడికొండలోని రెడ్డి కన్వెన్షన్ లో జరిగిన అబస్టేట్రిక్స్ మరియు గైనకాలజీ తెలంగాణ చాప్టర్ 7వ వార్షిక రాష్ట్ర సదస్సులో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు 2వేల మంది గైనకాలజిస్టులు హాజరైన ఈ సమావేశాన్ని జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ ప్రధానంగా గైనకాలంజస్ట్ లు మహిళలు కాబట్టి మహిళల మానసిక, ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. మహిళలకు వివిధ దశలలో వచ్చే అనారోగ్య సమస్యలను వారికీ అర్థం అయ్యే విధంగా వివరించాలని అన్నారు. కౌమార దశ నుండి గర్భిణీలు, మోనోపాజ్, క్యాన్సర్, వయో వృద్దులు ఎదుర్కొనే సమస్యల పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. రక్త హీనంత, పౌష్టిక ఆహార లోపం వంటి వాటితో పాటు క్యాన్సర్ స్క్రినింగ్ టెస్ట్ లు చేయాలని అన్నారు. కోవిడ్ తర్వాత డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలతో సతమతమౌతున్నారని కావున మానసిక సమస్యలు, మెంటల్ హెల్త్ పై కూడా దృష్టి సారించాలని వివరించారు. రానున్న రోజులలో కేంద్ర ప్రభుత్వం నుండి రీసెర్చ్ మరియు పరిశోధనలు చేయడానికి అధిక నిధులు కేటాయించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఆధునిక శస్త్ర చికిత్సలు, వ్యాధులపై పరిశోధనలు జరిపే విధంగా కూడా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా సాధికారత అంటే కేవలం ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా బలంగా ఉన్నప్పుడే నిజమైన సాధికారత సాధించినట్లు అవుతుందని తెలిపారు. ఇంత మంచి సమావేశాన్ని వరంగల్ వేదికగా నిర్వహించినందుకు ప్రత్యేక అభినదనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాళోజి హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కర్ణాకర్ రెడ్డి, డాక్టర్ శాంత కుమారి, డాక్టర్ జామున దేవి, డాక్టర్ నరసింహ రెడ్డి, డాక్టర్ సంధ్యా రాణి, డాక్టర్ మధు చంద్ర, ఇతర గైనకాలంజస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.